Andhra Pradesh: రుయాలో మరో దారుణం.. ఆస్పత్రిలో వైద్యులు లేరంటూ సిబ్బంది అమానుషం

|

May 11, 2022 | 9:50 AM

తిరుపతి(Tiruapati) రుయా ఆస్పత్రిలో బైక్ పై బాలుడి మృతదేహం ఘటన మరవకముందే మరో అమానవీయం చోటు చేసుకుంది. శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన నిపుణులు అందుబాటులో లేరంటూ బాధితుడిని...

Andhra Pradesh: రుయాలో మరో దారుణం.. ఆస్పత్రిలో వైద్యులు లేరంటూ సిబ్బంది అమానుషం
Ruia
Follow us on

తిరుపతి(Tiruapati) రుయా ఆస్పత్రిలో బైక్ పై బాలుడి మృతదేహం ఘటన మరవకముందే మరో అమానవీయం చోటు చేసుకుంది. శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన నిపుణులు అందుబాటులో లేరంటూ బాధితుడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అంతే కాదు ఏదైనా ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడం గమనార్హం. చిత్తూరు(Chittoor) జిల్లా పాలసముద్రం మండలానికి చెందిన వెంకటేశ్‌ మేకల మేత కోసం చెట్టెక్కాడు. ఆకులు కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతనిని కుటుంబసభ్యులు గమనించి, ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేసి, 3 గంటలు వేచి చూసినా 108 వాహనం రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సొంత ఖర్చులతో ప్రైవేటు వాహనంలో తిరుపతికి తరలించారు. చికిత్స కోసం స్విమ్స్ కు తీసుకెళ్లగా అక్కడ చేర్చుకోలేదు. దీంతో అక్కడి నుంచి రుయాకు తరలించారు. అక్కడ వెంకటేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆర్థో వైద్యులతోపాటు న్యూరో, సీటీ సర్జన్ల పర్యవేక్షణ ఉండాలని, రుయాలో అలాంటి నిపుణులు లేకపోవడంతో తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో ఇక్కడా చేర్చుకోలేమని, ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. దీంతో వెంకటేశ్‌ను కుటుంబ సభ్యులు చెన్నై తీసుకెళ్లారు. న్యూరో, సీటీ సర్జన్ల పర్యవేక్షణ లేకుండా కీలకమైన ఆర్థో శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నామని రుయా సూపరింటెండెంట్ వెల్లడించారు.

తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెస్స్ కు డబ్బులు ఇవ్వలేని ఓ తండ్రి.. కన్నకొడుకు డెడ్ బాడీని భుజంపై వేసుకుని బైక్ పై వెళ్లాడు. సుమారు 12 కి.మీ. ప్రయాణించి అక్కడ తాము మాట్లాడుకున్న అంబులెన్స్‌లో ఎక్కించి మృతదేహాన్ని తన సొంత ఊరికి తీసుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్‌ ఆర్‌ఎంవో సరస్వతీదేవిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Bill Gates: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ మైక్రోసాఫ్ట్ దిగ్గజం ట్వీట్..

Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు.. నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు..