Tirupati: తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు.. ఎలా వచ్చింది?

|

Oct 21, 2024 | 2:08 PM

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతుంది. తిరుమలో డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగరవేయవద్దని రూల్ ఉంది. హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirupati: తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు.. ఎలా వచ్చింది?
Helicopter Circled In Tirumala
Follow us on

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. వాస్తవానికి తిరుమలో డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగరవేయవద్దని రూల్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తిరుపతిలో నో ఫ్లే జోన్‌ను పోలీసులు ప్రకటించారు. ఈ నిబంధన ఉన్నా ఆకాశంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమని భక్తులు మండిపాడున్నారు. దీంతో టీటీడీ ఆ హెలికాప్టర్‌ ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఈ విషయంపై ఏవీయేషన్ అధికారులకు టీటీడీ సమాచారం అందించారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంపై వారు అధికారులతో చర్చిస్తున్నారు. ఇటీవలే తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు ఉందనే ఆరోపణల వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలో నిజం లేదని ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తోసిపుచ్చింది. తిరుపతి లడ్డూ, ఎంతో గౌరవప్రదమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. లక్షలాది మంది యాత్రికులకు చాలా కాలంగా స్వచ్ఛత, భక్తికి చిహ్నంగా లడ్డూ ఉంది. అయితే ఇటీవల వచ్చిన వాదనలు తిరుమల ఆలయంలో అమలులో ఉన్న నాణ్యత నియంత్రణ చర్యలపై భక్తుల్లో సందేహాలకు దారితీశాయి.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..