ఏలూరులో పేలిన హీలియం గ్యాస్ బెలూన్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. చిన్నారులు ఆడుకుంటుండగా..

|

Dec 27, 2022 | 4:26 PM

ఏలూరు ఆగిరిపల్లిలో హీలియం గ్యాస్ బెలూన్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ముగ్గుర్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఏలూరులో పేలిన హీలియం గ్యాస్ బెలూన్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. చిన్నారులు ఆడుకుంటుండగా..
Helium Gas Balloon
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లిలో హీలియం గ్యాస్ బెలూన్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ముగ్గుర్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆగిరిపల్లిలోని ఓ బిల్డింగ్‌పై హీలియం గ్యాస్ బెలూన్‌ తాడుతో కట్టి వేలాడదీశారు. అందులో గాలి తగ్గడంతో పాటు తాడు తెగిపోయి బెలూన్ కిందపడిపోయింది. అది నేరుగా ఓ పొగ గొట్టంపై పడింది. పొగ గొట్టం వేడిగా ఉండటంతో ఒక్కసారిగా బెలూన్ పేలిపోయింది.

అదే సమయంలో దాబాపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు మంటల సెగ తాకింది. అరుపులు కేకలతో అక్కడికి వెళ్లిన మహిళకు కూడా గాయాలైనట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బిల్డింగ్‌పైకి ఎక్కారు. గాయాలతో ఇబ్బందిపడుతున్న చిన్నారుల్ని గమనించి 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇవి కూడా చదవండి

తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు బిల్డింగ్‌పై బెలూన్‌ ఎవరు పెట్టారు..? ఎందుకు పెట్టారన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..