Andhra Pradesh: తెగే దాకా లాగొద్దు.. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు.. ఫేస్ యాప్ అటెండెన్స్ పై మండి పడుతున్న టీచర్స్

|

Sep 01, 2022 | 10:44 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గవర్నమెంట్ స్కూల్స్ లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ ఫేస్ యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలుజారీ చేసింది. కాగా ఈ విధానం ఇవాల్టి నుంచి..

Andhra Pradesh: తెగే దాకా లాగొద్దు.. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు.. ఫేస్ యాప్ అటెండెన్స్ పై మండి పడుతున్న టీచర్స్
Teachers Protest In Ap
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గవర్నమెంట్ స్కూల్స్ లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ ఫేస్ యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలుజారీ చేసింది. కాగా ఈ విధానం ఇవాల్టి నుంచి అమలులోకి వచ్చింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లను మినహాయించి మిగతా వారందరూ ఈ యాప్ ద్వారానే హాజరు వేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో దాదాపు రెండు లక్షల వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. టీచర్ల అటెండెన్స్ తో పాటు, స్టూడెంట్స్ హాజరనూ ఈ యాప్ లోనే వేయాలన్న అధికారుల ఆదేశాలతో చాలా వరకు ఉపాధ్యాయులు (Govt Teachers in AP) యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే అందరూ ఉదయం ఒకేసారి హాజరు వేస్తుంటే సర్వర్‌ సమస్య ఏర్పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అందరూ ఒకే సమయంలో అటెండెన్స్ వేయడం వల్ల సర్వర్ పై ఒత్తిడి పడి సాంకేతిక సమస్య నెలకొంటుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. ఫేస్‌ అటెండెన్స్ ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్ ద్వారా పర్సనల్ వివారాలన్నీ లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము గతంలోనే ఈ యాప్​ను ఫోన్లలో డౌన్లోడ్​ చేసుకోమని చెప్పేశామని, వ్యక్తిగత డేటాకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నా అధికారులు వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. కచ్చితంగా అమలు చేయాలనే నిర్ణయాన్ని తాము కచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ విధానం సరైనది కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తెగేదాకా లాగుతోందని, అధికారులు కూడా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులపై దాడి, తప్పుడు కేసులు, కట్టుకథలు అల్లి కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తేల్చి చెప్పేశారు.

ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసే విధానం పై మొదటి నుంచి ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారి డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రితో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు సొంత ఫోన్లలో ఫేస్ అటెండెన్స్ కు ఒప్పుకునేది లేదని చెప్పారు. తమ స్మార్ట్‌ ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్‌ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మొబైల్‌ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవు నిబంధన తొలగిస్తామని, 15 రోజులు ఈ-హాజరుపై శిక్షణ ఇస్తామని మంత్రి వారికి నచ్చజెప్పారు. అయినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతికేరించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.