Andhra Pradesh: ఒక్క ట్వీట్‌తో పొలిటికల్ సర్కిల్‌లో ఉక్కిరిబిక్కిరి.. ఇంతకీ ఏం జరగబోతోంది..!

|

Oct 23, 2024 | 4:07 PM

పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారంటే తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు సంబంధించిన విషయమై ఉంటుందని పొలిటికల్ ఎక్స్‌ఫర్ట్స్ భావిస్తున్నారు.

Andhra Pradesh: ఒక్క ట్వీట్‌తో పొలిటికల్ సర్కిల్‌లో ఉక్కిరిబిక్కిరి.. ఇంతకీ ఏం జరగబోతోంది..!
Tdp Tweet
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ ట్వీట్ పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ ట్వీట్ రాజకీయ నేతల్లో చెమటలు పట్టిస్తోంది. అక్టోబర్ 24 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ అంతటా ఇదే టాపిక్. అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ ఖాతా వేదికగా ఈ ట్వీట్ పోస్ట్ కావడం విశేషం. ” బిగ్ ఎక్స్‌పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్‌డ్” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీంతో గురువారం మధ్యాహ్నం ఏం జరగబోతోంది అనే విషయంమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఎక్స్‌పోజ్ అన్నారంటే ఏదైనా కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన ఉంటుందా..? రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ.. లేదా ఇతర మంత్రులు, శాఖల అధికారులు కీలక సమాచారం వెల్లడిస్తారా..? అన్నదీ ఆసక్తికరంగా మారిది. ఇలా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారంటే తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు సంబంధించిన విషయమై ఉంటుందని పొలిటికల్ ఎక్స్‌ఫర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు టీడీపీలో సభ్యత్వ నమోదు అక్టోబర్ 26వ తేదీ నుంచి మొదలుకానుంది. రూ.100లు చెల్లిస్తే సాధారణ సభ్యత్వం ఇవ్వనున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షలు బీమా సదుపాయం కల్పించనున్నారు. ఇక ఈ ఏడాది నుంచి టీడీపీ కొత్తగా జీవితకాల సభ్యత్వం ఇవ్వనుంది. సభ్యత్వ నమోదుపై ఇప్పటికే నేతలకు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సభ్యత్వం నమోదులో అందరూ పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇదిలావుంటే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎంక్వయిరీ స్పీడందుకుంది. అరెస్టులపర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో సరెండయ్యారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడైన పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగాపనిచేశారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు.. వందమందిని గుర్తించి నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌ సైతం మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..