Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్‌ పాలిటిక్స్‌

రాప్తాడు నుంచి చంద్రగిరి వరకు, ఆళ్లగడ్డ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏపీలో స్థానిక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ సమరం కొత్త మలుపులు తిరుగుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన రాయలసీమలో ఇప్పుడు మాటల యుద్ధమే ప్రధాన ఆయుధంగా మారింది. స్థానిక స్థాయిలో చెలరేగుతున్న ఈ రాజకీయ వేడి రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది.

Andhra Politics: తగ్గేదే లే..! చినుకుల్లేకపోయినా.. జోరుగా చిటపటలు.. పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
Andhra Pradesh Politics

Updated on: Jul 09, 2026 | 9:49 PM

సీమలో ఒకప్పుడు కత్తులు-గొడ్డళ్లతో నడిచిన ఫ్యాక్షనిజం ఇప్పుడు కాస్త నెమ్మదించింది. ఇంకొక్కమాటలో చెప్పాలంటే, రంగు మార్చుకుని రాళ్లు-బీరుబాటిళ్లతో సరిపెట్టుకుమటోంది. రక్తచరిత్రలతో రిపీట్లు కొట్టిన సీమ జిల్లాల్లో ఇప్పుడు పీస్ కీపింగ్ ఫోర్సులు బయలుదేరాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి అడ్డా అనిపించుకున్న అనంతపురం జిల్లా.. ఇప్పుడు ఆల్‌ ఈజ్ వెల్ అంటోంది. కాకపోతే, మాటలే తూటాలౌతున్నాయి. సవాళ్లు-ప్రతిసవాళ్లతో మిస్సైళ్ల మోత మోగుతోంది. సరికొద్ద ఫైర్‌బ్రాండ్స్ పుట్టుకొచ్చి అనంత జిల్లా రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేసినట్టుంది. రాఫ్తాడులో రప్పారప్పా. తోపుదుర్తి ప్రకాష్‌ వర్సెస్ ఎమ్మెస్ రాజు.. మిడిల్‌లో ఎంట్రీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్..! సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లుతోంది అనంత జిల్లా. తనపై తోపుదుర్తి చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అంతటితో ఆగలేదు. అంతుచూస్తానని హెచ్చరించారు. అదీ గురువారంలోగా అంటూ డెడ్‌లైన్ పెట్టిమరీ వార్నింగ్ ఇవ్వడంతో తోపుదుర్తి ఇంటిదగ్గర టెన్షన్‌టెన్షన్. కార్యకర్తలారా రండి… పోలీసులడ్డొస్తే తోసుకురండి, పోరాటానికి సిద్ధం కండి అని తోపుదుర్తి ఇచ్చిన పిలుపుతో వైసీపీ దండు మొత్తం కదలివచ్చింది. భారీగా మోహరించిన పోలీసులు, ఇంటి చుట్టూ బారికేడ్లు కట్టేశారు. తోపుదుర్తి ఇంట్లో రాళ్లు, బీరు బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలెక్కడ మొదలైంది గొడవ? తనను చంపడానికి కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై.. రెండేళ్లలోనే...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి