Chandrababu Naidu: నిరసనల ‘సీమ’.. కర్నూలు జిల్లాలో హైటెన్షన్‌ మధ్యే ముగిసిన చంద్రబాబు పర్యటన..

|

Nov 19, 2022 | 8:15 AM

ఏపీలో చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ జనంలోకి వెళుతుంటే నిరసనల సీమ కుడుతోందిట. మూడు రాజధానుల అగ్గి రగులుతోందట. నిరసనల రూపంలో ప్రవహిస్తున్న న్యాయ రాజధాని కేక, కేపిటల్‌ పొలికేకగా మారింది.

Chandrababu Naidu: నిరసనల ‘సీమ’.. కర్నూలు జిల్లాలో హైటెన్షన్‌ మధ్యే ముగిసిన చంద్రబాబు పర్యటన..
Chandrababu Naidu
Follow us on

ఏపీలో చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ జనంలోకి వెళుతుంటే నిరసనల సీమ కుడుతోందిట. మూడు రాజధానుల అగ్గి రగులుతోందట. నిరసనల రూపంలో ప్రవహిస్తున్న న్యాయ రాజధాని కేక, కేపిటల్‌ పొలికేకగా మారింది. చంద్రబాబు సీమ టూర్‌ ఈసారి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. చంద్రబాబు మూడు రోజుల కర్నూలు పర్యటన నిరసనల మధ్యే సాగింది. కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ బాబుకు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. నిరసనకారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే, టీడీపీ తీరుకు నిరసనగా ఇవాళ కర్నూలు జిల్లాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది విద్యార్థి జేఏసీ.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ టూర్‌ ఈసారి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. కర్నూలు గడ్డపై ఆయనకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. కర్నూలులో హైకోర్టుకు అనుకూలంగా ప్రకటన చేయాలంటూ టీడీపీ అధినేత పర్యటించిన ప్రతి చోటా నిరసన వ్యక్తమైంది. అయితే నిరసనకారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు టూర్‌ తీవ్ర టెన్షన్‌ మధ్యే ముగిసింది. కర్నూలు టౌన్‌లో పెద్దయెత్తున నిరసన వ్యక్తమైంది. బుధవారం నుంచి వరుసగా మూడు రోజులుగా బాదుడే బాదుడే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించారు టీడీపీ అధినేత. పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలుల్లో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. లాయర్లు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. కర్నూలులో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు టీడీపీ అధినేత పర్యటించిన ప్రతి చోటా నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు, లాయర్లు. టీడీపీ కార్యకర్తలకు, వారికి మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఆఫీస్‌ దగ్గర చంద్రబాబు సభ జరుగుతున్నంత సేపు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు న్యాయవాదులు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు చెప్పులు కూడా విసిరారు.

నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాట తీస్తానని, తాను రౌడీలకే రౌడీని అంటూ చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

జగన్నాధగట్టులోని టిడ్కో ఇళ్ల దగ్గరకు చంద్రబాబు వెళ్లినప్పుడు కూడా నిరసన తెలిపారు విద్యార్థులు, లాయర్లు. జనంలో చంద్రబాబుపై ఉన్న కోపానికి నిదర్శనమే ఈ పరిణామాలన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్‌. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌.

నిరసన వ్యక్తం చేస్తున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారని, దీనికి నిరసనగా కర్నూలు జిల్లా అంతటా విద్యా సంస్థల బంద్‌ పాటించాలని పిలుపునిచ్చింది విద్యార్థి జేఏసీ.

అంతకుముందు పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ తగిలింది. ర్యాలీగా వస్తుండగా కొందరు స్థానికులు నిరసన తెలిపారు. న్యాయరాజధానిగా కర్నూలుకు మద్దతు తెలపాలని డిమాండ్‌ చేయడంతో పాటు బాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

పత్తికొండలో చంద్రబాబు రాజకీయ ఎమోషన్‌ రాజేశారు. కౌరవసభగా మారిన ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశా…మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకు ఇవే చివరి ఎన్నికలు అని బాబు అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..