Andhra Pradesh: మంచినీరు మహాప్రభో… చందర్లపాడు మండలంలో దాహం కేకలు.. కుళాయి వద్ద బారులు తీరిన ప్రజలు

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 11:51 AM

వారం రోజుల అనంతరం అర్దరాత్రి సమయం లో అధికారులు మంచినీరు వదలడంతో కుళాయిల వద్ద ప్రజలు బారులు తీరారు. పంపులు వద్ద భారీ మొత్తంలో ఉన్న మంచినీటి బిందెలతో నిలుచుతున్నారు.

Andhra Pradesh: మంచినీరు మహాప్రభో... చందర్లపాడు మండలంలో దాహం కేకలు.. కుళాయి వద్ద బారులు తీరిన ప్రజలు
Drinking Water Crisis In Na
Follow us on

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామ(Nandigama) చందర్లపాడు మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా మారింది.  తోట రావులపాడు గ్రామంలో సాధారణ రోజుల్లోనే తమ ప్రాంతంలో మంచినీరు సరఫరా అంతంతమాత్రంగానే ఉంటోందని, .. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మంచినీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చిందని మహిళలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా త్రాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారం రోజుల అనంతరం అర్దరాత్రి సమయం లో అధికారులు మంచినీరు వదలడంతో కుళాయిల వద్ద ప్రజలు బారులు తీరారు.  పంపులు వద్ద భారీ మొత్తంలో ఉన్న మంచినీటి బిందెలతో నిలుచుతున్నారు.

అయితే అంతంతమాత్రంగా ఉన్న సురక్షిత మంచినీటి సరఫరా..ఇప్పుడు అర్దరాత్రి సమయం లో త్రాగునీరు వదలడంఫై  గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిమెట్ల నుంచి చందర్లపాడు మండలంలోని గ్రామాలకు త్రాగునీరు సరఫరా అవుతుంది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసి వచ్చిన రైతు, రైతు కూలీలు తమకు ఈ త్రాగునీరు దుస్థితి ఏంటి అంటూ వాపోతున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒకచోట అంతరాయంతో రక్షిత మంచి నీటి పథకాలకు సరఫరా ఆగిపోతుండటం, దాన్ని రోజుల తరబడి పంచాయితీ సిబ్బంది పట్టించుకోపోవడంతో దాహం కేకలు మిన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి