Rajahmundry: ఉత్పత్తిలోనే కాదు.. ఉచిత మొక్కల పంపిణీలోనూ సరిలేరు తమకెవ్వరు అంటున్న పల్ల వెంకన్న నర్సరీ..

|

Dec 20, 2021 | 8:54 AM

Rajahmundry: ఉత్పత్తిలోనే కాదు.. ఉచిత మొక్కల పంపిణీలోను సరిలేరు తమకెవ్వరు అంటుంది పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం. దేశంలోనే ప్రముఖ నర్సరీగా పేరొందిన పల్ల వెంకన్న నర్సరీ

Rajahmundry: ఉత్పత్తిలోనే కాదు.. ఉచిత మొక్కల పంపిణీలోనూ సరిలేరు తమకెవ్వరు అంటున్న పల్ల వెంకన్న నర్సరీ..
Flower Tree
Follow us on

Rajahmundry: ఉత్పత్తిలోనే కాదు.. ఉచిత మొక్కల పంపిణీలోను సరిలేరు తమకెవ్వరు అంటుంది పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం. దేశంలోనే ప్రముఖ నర్సరీగా పేరొందిన పల్ల వెంకన్న నర్సరీ మొక్కల ఉత్పత్తితో పాటు సామాజిక బాధ్యత ను చాటుకొంటుంది. తాజాగా శ్రీ రామానుజ సహస్రాబ్దికి 11,500 మొక్కల వితరణ చేశారు నర్సరీ నిర్వాహకులు. పర్యావరణమే పరమహితంగా కోటి మొక్కల పంపిణీ యజ్ఞంతో ముందుకెళ్తున్న కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం మరో మహా ఘట్టానికి ముందడుగు వేసింది. హైదరాబాద్ శంషాబాద్ లోని శ్రీ రామానుజ చినజియర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న సహస్రాబ్దికి పల్ల వెంకన్న చారటిబుల్ ట్రస్ట్ 11,500 పూల జాతి మొక్కలను వితరణ చేసింది. భోగన్విలియా రకాలు, నూరు వరహాలలో వివిధ రంగుల పూలమొక్కలు, గోవర్ధనం, గరుడవర్ధనం, దురంతా ప్లమేరీ వంటి బోర్డర్ రకాల మొక్కలను లారీలో ఎగుమతి చేశారు. ప్రముఖ పల్ల వెంకన్న నర్సరీ నుండి 25 టన్నుల లారీలో ఈ మొక్కలు రామానుజ ఆశ్రమానికి తరలివెళ్లాయి. ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం, విశాఖ శారదా పీఠాలకు కూడా కొన్ని వేల మొక్కలను పంపిణీ చేశారు. పచ్చదనం విస్తరణకు తమ తండ్రి దివంగత పల్ల వెంకన్న ఎంతో ప్రోత్సహించేవారని, ఆయన సదాశయంతో ముందుకెళ్తున్నామని ట్రస్ట్ చైర్మన్ పల్ల సత్యనారాయణ మూర్తి, ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రమణ్యం, ట్రస్ట్ సభ్యులు గణపతి, వెంకటేష్, వినయ్ లు తెలిపారు.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..