AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్సుల్లో గ్రామస్థుల నిరసన పత్రాలు

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల్లో ఓటు పత్రాలతో పాటు వినతిపత్రాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలం కంకాలపల్లి గ్రామానికి చెందిన ఓటర్లు U ఆకారపు ఆర్వోబీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ వినూత్న నిరసన తెలిపారు.

Andhra Pradesh: ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్సుల్లో గ్రామస్థుల నిరసన పత్రాలు
Protest Pamphlets Found In Ballot Boxes At Narasaraopet
Shaik Madar Saheb
|

Updated on: Nov 07, 2026 | 10:37 AM

Share

నరసరావుపేట / అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ (పరిషత్) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత నడుమ అధికారులు లెక్కింపు చేపడుతున్నారు. ఈ క్రమంలో నరసరావుపేట కౌంటింగ్ సెంటర్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.. నరసరావుపేటలోని ఎఎమ్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌లో బ్యాలెట్ బాక్సులు తెరిచిన అధికారులకు ఊహించని వింత అనుభవం ఎదురైంది. ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయగా, అందులో ఓటు కాగితాలతో పాటు గ్రామానికి చెందిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముద్రించిన వినతిపత్రాలు (పాంప్లెట్స్) లభ్యమయ్యాయి. సత్తెనపల్లి మండలం కంకాలపల్లి గ్రామానికి చెందిన ఓటర్లు ఈ వినూత్న నిరసనకు దిగినట్లు అధికారులు గుర్తించారు. తమ గ్రామానికి సమీపంలో నిర్మిస్తున్న ‘U’ ఆకారపు ఆర్వోబీ (ROB) నిర్మాణం వల్ల స్థానికంగా ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను ఆ పాంప్లెట్లలో ఏకరువు పెట్టారు. ‘U’ ఆకారపు అండర్‌పాస్ వద్దని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేష్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రధాన రహదారికి బ్రిడ్జిని నేరుగా లింక్ చేయాలని కోరుతూ తమ నిరసనను బ్యాలెట్ బాక్సుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబందించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలాఉంటే.. ఏపీలో మొత్తం 7,767 MPTC, 582 ZPTC స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కాగా, ఇప్పటికే 77 ZPTC స్థానాలు, 2,051 MPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలోని 365 కేంద్రాల్లో మొత్తం 9,062 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో 1,000 ఓట్ల చొప్పున లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40,679 మంది పోలీసులతో మూడంచెల భద్రతను నిర్మించారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల అప్డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జస్ట్ రూ.35కే కిలో ఉల్లి.. దీపావళి వేళ పండుగ చేసుకునే వార్త
జస్ట్ రూ.35కే కిలో ఉల్లి.. దీపావళి వేళ పండుగ చేసుకునే వార్త
మూడు మట్టి కుండలతో దొంగను పట్టుకున్న మంత్రి.. ఎలాగంటే?
మూడు మట్టి కుండలతో దొంగను పట్టుకున్న మంత్రి.. ఎలాగంటే?
ఏపీ MPTC, ZPTC కౌంటింగ్‌లో వింత అనుభవం.. ఓటు పత్రాలతో పాటు..
ఏపీ MPTC, ZPTC కౌంటింగ్‌లో వింత అనుభవం.. ఓటు పత్రాలతో పాటు..
లంకతో వన్డే సిరీస్.. వైజాగ్‌లో చివరి మ్యాచ్ ఆడనున్న రోకో
లంకతో వన్డే సిరీస్.. వైజాగ్‌లో చివరి మ్యాచ్ ఆడనున్న రోకో
రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. చిన్నారుల చికిత్సకు 6 కోట్లు విరాళం
రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. చిన్నారుల చికిత్సకు 6 కోట్లు విరాళం
దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు
దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు
గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి
గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి
రెండ్రోజులు బ్యాంక్‌లు బంద్.. వచ్చే వారంలో సెలవులు ఇవే..
రెండ్రోజులు బ్యాంక్‌లు బంద్.. వచ్చే వారంలో సెలవులు ఇవే..
ఉద్యోగం తొలగింపు సాయం అదిరింది! కాన్వా పై ప్రశంసల వెల్లువ!
ఉద్యోగం తొలగింపు సాయం అదిరింది! కాన్వా పై ప్రశంసల వెల్లువ!
2 నెలలు నిద్రపోతే చాలు.. రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ, ఫారిన్ ట్రిప్!
2 నెలలు నిద్రపోతే చాలు.. రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ, ఫారిన్ ట్రిప్!