ఇక్కడ మేం లోకల్‌.. ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి రాగాలు.. తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ళు.. ప్రతి సవాళ్ళు..

|

Apr 02, 2023 | 9:38 PM

ఏపీలో ఇటు అధికార వైసీపీ...అటు టీడీపీల్లో లోకల్‌ వర్సెస్‌ నాన్‌లోకల్‌ ఇష్యూ భగ్గుమంటోంది. స్థానిక నినాదాన్ని అందుకున్న అసమ్మతి నేతలు...అదే ఆయుధంగా యుద్ధానికి సిద్ధమౌతున్నారు. ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధమని ప్రకటనలు గుప్పిస్తూ అధిష్టానాన్ని సైతం ఎదుర్కోవడానికి సిద్ధమౌతున్నారు.

ఇక్కడ మేం లోకల్‌.. ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి రాగాలు.. తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ళు.. ప్రతి సవాళ్ళు..
Sattenapalli Ycp
Follow us on

తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మీయ సమ్మేళనాల హల్‌చల్‌ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక నినాదం ఊపందుకుంది. ఎక్కడినుంచో వచ్చినోళ్ళు కాదు.. ఇక్కడ మేం లోకల్‌ అంటున్నారు స్థానిక నేతలు. అందుకు ఆత్మీయ సమ్మేళనాలు… సమీకరణలు…సవాళ్ళు… ప్రతి సవాళ్ళు ఏపీ లో పాలిటిక్స్‌.. ప్రకంపనలు రేపుతున్నాయి. సత్తెనపల్లిలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర మాజీ ఛైర్మన్‌, చిట్టా విజయభాస్కరరెడ్డి అంబటి కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం పొలిటికల్‌ హీట్‌ని క్రియేట్‌ చేస్తోంది. మంత్రి అంబటి రాంబాబుపై స్థానిక ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి. సత్తెనపల్లిలో వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు చిట్టా.

ఆరు నూరైనా…నూరు ఆరైనా…సత్తెనపల్లిలో తానే పోటీచేస్తానని తెగేసి చెప్పారు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి..ఇందుకోసం ఆయన స్థానిక నినాదం అందుకున్నారు. మరోవైపు ఏపీ టీడీపీలో లోకల్‌ నినాదం ఊపందుకుంది. మైలవరం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మైలవరంలో దేవినేని ఉమాకి షాకిచ్చారు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు.. పక్కనియోజకవర్గం వాళ్ళకోసం పాలేరుగా పనిచేసానంటూ అసమ్మతి రాగం ఆలపించారు బొమ్మసాని.

దేవినేనిపై టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వారికోసం ఇంతకాలం పాలేరులా పనిచేశానంటూ దేవినేని ఉమ పై పరోక్షంగా కామెంట్స్‌ చేశారు బొమ్మసాని. తాను స్థానికుడినైనా…ఆయన కోసం ఇన్నాళ్ళూ పనిచేశానన్నారు.

ఈసారి మాత్రం నియోజకవర్గానికి సేవచేసే అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబుని బహిరంగంగా డిమాండ్‌ చేశారు బొమ్మసాని. ఇదే ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది.

అయితే మైలవరం లో ఇప్పుడే కాదు.. టీడీపీ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా సైతం ఇరు వర్గాలు వేర్వేరుగా సభలు నిర్వహించారు. చాలా కాలంగా మైలవరం వర్గ విభేదాలు టీడీపీలో కాకరేపుతున్నాయి…ఇక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ…రాను రాను ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాలను కుదిపేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం