AP Covid Guidelines: మరోసారి కరోనా మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ

|

Jan 07, 2021 | 11:14 PM

AP Covid Guidelines: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. గతంలో కంటే కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మరో కొత్త రకం స్ట్రెయిన్ వైరస్...

AP Covid Guidelines: మరోసారి కరోనా మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
Andhra Pradesh Corona Updates
Follow us on

AP Covid Guidelines: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. గతంలో కంటే కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మరో కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ తో మరింత భయం పట్టుకుంది. ఇక ఏపీ రాష్ట్రంలో కూడా అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని ఏపీ వైద్యారోగ్య శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆస్పత్రుల్లో చికిత్సలు, కరోనా కేసుల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపింది. ఇక యూకే స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించి, అగ్నిమాపకశాఖ నుంచి ఎన్ వోసీ తీసుకోవాలని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించాలని సూచించింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా టోల్ ఫ్రీ నంబర్ 104 కొనసాగించడంతో పాటు వైద్య సేవలు అందించాలని తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల నోటిఫై, ఫీవర్ క్లినిక్స్ నిర్వహణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే చేపట్టాలని తెలిపింది. అలాగే కరోనాతో ఆస్పత్రుల్లో మరణిస్తే వారి మృతదేహాలను అప్పగించే సమయంలో నిబంధనలు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని, మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు అందించాలని ఆదేశించింది.

Corona Cases AP: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 295 పాజిటివ్ కేసులు నమోదు..