వాళ్లు అటు, వీళ్లు ఇటు: ఏపీలో పొలిటికల్ హీట్, బీజేపీ నేతలు రామతీర్థం వెళ్లడానికి ట్రైచేస్తే, గవర్నర్ దగ్గర టీడీపీ నేతల కంప్లైంట్

|

Jan 07, 2021 | 10:13 PM

ఏపీలో గురువారం రాజకీయం వేడివేడిగా సాగింది. బీజేపీ నేతలు రామతీర్థం వెళ్లడానికి ప్రయత్నిస్తే.. టీడీపీ నేతలు గవర్నర్‌ దగ్గరకు వెళ్లారు...

వాళ్లు అటు, వీళ్లు ఇటు: ఏపీలో పొలిటికల్ హీట్,  బీజేపీ నేతలు రామతీర్థం వెళ్లడానికి ట్రైచేస్తే, గవర్నర్ దగ్గర టీడీపీ నేతల కంప్లైంట్
Follow us on

ఏపీలో గురువారం రాజకీయం వేడివేడిగా సాగింది. బీజేపీ నేతలు రామతీర్థం వెళ్లడానికి ప్రయత్నిస్తే.. టీడీపీ నేతలు గవర్నర్‌ దగ్గరకు వెళ్లారు. ఆలయాల్లో వరుస దాడుల నేపథ్యంలో సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తోంది టీడీపీ. దీనిపై గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, బుద్ధా వెంకన్న, శ్రవణ్‌కుమార్‌, వర్ల రామయ్యలకు రాజ్‌భవన్‌ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. గవర్నర్ దగ్గరకు వెళ్లిన టీడీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఆలయాల్లో వరుస దాడులు, ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మాట్లాడుతూ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు ధూళిపాళ్ల. ఎన్నో ఘటనలు జరుగుతున్నా సీఎం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. వాళ్ల వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. రామతీర్థంలో విజయసాయిపై దాడి నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఆయన్ను అరెస్ట్‌ చేస్తే సీఎం జగన్‌ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు బుద్ధా వెంకన్న.