ఇళ్ల స్థలాల కోసం తవ్వితే పురాతన శివాలయం బయటపడింది..

ఏపీలో గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం కారుమూరులో పురాతాన శివాలయాన్ని గుర్తించారు అధికారులు. గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెండు ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని చదును చేసేందుకు..

ఇళ్ల స్థలాల కోసం తవ్వితే పురాతన శివాలయం బయటపడింది..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 1:30 PM

ఏపీలో గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం కారుమూరులో పురాతాన శివాలయాన్ని గుర్తించారు అధికారులు. గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెండు ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని చదును చేసేందుకు.. కూలీలు ముళ్ల చెట్లు తొలగిస్తుండగా దేవాలయం వెలుగు చూసింది. ఆ ఆలయంలో రెండు శివ లింగాలు, ఒక నంది, దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. సమాచారం తెలుసుకొన్న గ్రామస్థులు.. ఆలయానికి చేరుకొని విగ్రహాలకు పూజలు చేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిస్తామని చెప్పారు. కాగా ఆలయం 300 ఏళ్ల నాటిది అయి ఉండొచ్చని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు.

Read More:

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్