Jurala Dam: జురాల ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందా?.. ప్రాజెక్ట్ పైనుంచి రాకపోకలను నిలిపివేయనున్నారా?

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 3:56 PM

కృష్ణా నది (Krishna River).. రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్న మహా నది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణవేణి.. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవి వద్ద సాగరంలో అంతర్లీనమవుతోంది. ఈ నదిపై..

Jurala Dam: జురాల ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందా?.. ప్రాజెక్ట్ పైనుంచి రాకపోకలను నిలిపివేయనున్నారా?
Jurala Project
Follow us on

కృష్ణా నది (Krishna River).. రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్న మహా నది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణవేణి.. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవి వద్ద సాగరంలో అంతర్లీనమవుతోంది. ఈ నదిపై ఎన్నో రకాల ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టులయిన నాగార్జునసాగర్, శ్రీశైలం ఈ నది పైనే ఉన్నాయి. అయితే వీటికి ముందే కృష్ణమ్మ పై జూరాల ప్రాజెక్టును నిర్మించారు. అయితే జురాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) ప్రమాదం పొంచి ఉందా? ప్రాజెక్ట్ పైనుంచి రాకపోకలను నిలిపివేయనున్నారా? ఇదే ఇప్పుడు స్థానికులకు టెన్షన్‌ కలిగిస్తోంది. అసలు జురాల ప్రాజెక్ట్‌ వద్ద ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లాలో కృష్ణానదిపై నర్మించిన తొలి ప్రాజెక్ట్‌ జురాల. 1985లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు ప్రమాదంలో పడుతోంది. భారీ వాహనాల రాకపోకలతో జురాల ఆనకట్ట దెబ్బతింటోంది. ఈ విషయాన్ని జలాశయాల భద్రతా సమీక్ష కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. జురాల ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందంటూ నివేదిక సమర్పించింది. ఆనకట్టపై వాహనాల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని కోరింది. లేకపోతే ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులను కలవరపెడుతోంది. జురాల ప్రాజెక్టు బ్రిడ్జ్‌పై నుంచి రాకపోకలను నిలిపివేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రభుత్వం ఇప్పుడే స్పందించి, ప్రత్యామ్నాయంగా మరో వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా.. 2019 వరదల్లో ప్రాజెక్టు పూర్తి గేట్లు ఎత్తడంతో ఆనకట్ట దిగువ భాగంతో ప్యారాపెట్‌ వాల్‌ కూలిపోయింది. కట్టపై నుంచి గ్యాలరీ ప్రదేశం పూర్తిగా మట్టితో నిండిపోయింది. దీనివల్లే కట్టకు ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు.
ఆనకట్టకు స్వల్ప మరమ్మతులు చేపట్టినప్పటికీ, పూర్తిస్థాయి రిపేర్లు మాత్రం జరగలేదు. 1995 నుంచి అందుబాటులోకి వచ్చిన జురాల ప్రాజెక్ట్‌ దగ్గర నిర్వహణ మినహా చెప్పుకోదగ్గ మరమ్మతులు చేయలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు, నిపుణుల కమిటీ రిపోర్ట్‌తో మరమ్మతులు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి