కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

ఏపీ లోని రెండు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, సత్తెనపల్లి, తూళ్లూరు, ముప్పాళ్ల, రాజుపాలెం, దుర్గి ప్రాంతాల్లో పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందని.. ఈ ప్రాంత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని, బ‌య‌ట సంచ‌రించ‌రాదని సూచించింది. చెట్ల కింద ఉండ‌టం ప్ర‌మాద‌క‌రమని […]

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 5:22 PM

ఏపీ లోని రెండు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, సత్తెనపల్లి, తూళ్లూరు, ముప్పాళ్ల, రాజుపాలెం, దుర్గి ప్రాంతాల్లో పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందని.. ఈ ప్రాంత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని, బ‌య‌ట సంచ‌రించ‌రాదని సూచించింది. చెట్ల కింద ఉండ‌టం ప్ర‌మాద‌క‌రమని చెప్పింది.