AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫంక్షన్ హాల్‌లో నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా గుండె ఆగినంత పనైంది.. ధైర్యముంటేనే వీడియో చూడండి..

విశాఖలోని పోతిన మలయ్యపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో పొదల్లో కదులుతూ కనిపించిన ఈ భారీ పైథాన్‌ను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. వింత శబ్దాలు వినిపించడంతో వెతికిన వారికి.. పది అడుగులకుపైగా పొడవున్న కొండచిలువ కనిపించడంతో గుండెల్లో దడ పుట్టింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ చాకచక్యంగా దానిని రెస్క్యూ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఫంక్షన్ హాల్‌లో నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా గుండె ఆగినంత పనైంది.. ధైర్యముంటేనే వీడియో చూడండి..
Giant Python Rescue
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 27, 2026 | 11:24 AM

Share

అది ఒక కన్వెన్షన్ సెంటర్.. శుభకార్యాలు, సమావేశాలు జరిగే వేదిక.. ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాల వాళ్ళు వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి..! అటుగా వెళ్తున్న వారికి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతా వెతికారు.. ఎక్కడా ఏమీ కనిపించలేదు. కాస్త వెనక్కి వెళ్లి చూస్తే.. పొదల వద్ద ఏదో కదులుతూ ఉంది. దగ్గరికి వెళ్లి చూసిన వారికి గుండె పట్టుకునేంత పనైంది. అక్కడ కనిపిచింది ఏంటో తెలుసా..! భారీ కొండ చిలువ.. వామ్మో.. అంటూ అంతా పరుగులు తీశారు. విశాఖ పోతిన మలయ్య పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో వైజాగ్ కన్వీన్షన్ సెంటర్ ఆవరణలో భారీ కొండ చిలువ భయపెట్టింది. పొదల్లో.. పైథాన్ కనిపించింది. చెట్లలో కదులుతూ ఉంది. ఎలా వచ్చిందో.. ఎప్పటి నుంచి వచ్చిందో ఏమో గానీ.. వింత వింత శబ్దాలు చేస్తుంది. దీంతో అటుగా వెళుతున్న వాళ్ళు చూసి గుండెలు పట్టుకున్నారు.

Giant Python

Giant Python

అంత పెద్ద కొండచిలువను చూసి.. వెంటనే స్నేక్ కేచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. ఆ భారీ కొండ చిలువను చాకచక్యంగా రెస్క్యూ చేశారు. పది అడుగుల పైగా పొడవున్న కొండచిలువను రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us