పీపీఈ కిట్‌ ధరించి రోడ్డుపై వచ్చిన వ్యక్తి.. జనాలు పరుగో పరుగు

విశాఖపట్టణం మన్యంలో పీపీఈ కిట్‌ ధరించిన ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు. అంతే అతడిని చూసిన జనం పరుగులు తీశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:36 pm, Sat, 14 November 20
పీపీఈ కిట్‌ ధరించి రోడ్డుపై వచ్చిన వ్యక్తి.. జనాలు పరుగో పరుగు

Man PPE Kit Vizag: విశాఖపట్టణం మన్యంలో పీపీఈ కిట్‌ ధరించిన ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు. అంతే అతడిని చూసిన జనం పరుగులు తీశారు. కానీ చివరకు విషయం తెలుసుకొని ఆ పీపీఈ కిట్‌ని విప్పించారు. (గ్రామీణ యువతి పాత్రలో ఒదిగిపోయిన కుమారి.. ‘రాధ’గా హెబా పటేల్‌ లుక్ చూశారా..!

వివరాల్లోకి వెళ్తే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి పీపీఈ కిట్‌తో రోడ్డుపై వచ్చాడు. కనిపించిన వారిని పలకరిస్తూ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అతడిని కరోనా రోగిగా భావించిన ప్రజలు పరుగులు తీశారు. దాదాపు రెండు గంటల పాటు అతడు సంచరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చివరకు అతడిని దూరాన ఆపి ప్రశ్నించగా.. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని అన్నాడు. దీంతో స్థానికులు మొదట షాక్‌కి గురయ్యారు, తరువాత ఊపిరిపీల్చుకున్నారు. ఆ తరువాత పీపీఈ కిట్‌ విప్పించి అక్కడి నుంచి పంపేశారు. (శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న హర్యానా సీఎం.. ఐజీఎంసీకి తరలింపు)