AP News: కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి.. కారణం అదేనా?

| Edited By: Velpula Bharath Rao

Oct 21, 2024 | 1:17 PM

కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి చెందింది. .ఘటన స్థలాలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు చిరుత మృతి గల కారణాలను వెలికితిస్తున్నారు. చిరుత మృతికి వేటగాళ్లు ఉచ్చు కారణమా లేక రైతులు పంటపొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

AP News: కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి.. కారణం అదేనా?
Leopard Died In Kaundinya Sanctuary
Follow us on

చిత్తూరు జిల్లాలోని కౌడన్య అభయారణ్యంలో చిరుత మృతి చెందింది. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది చిరుత మృతి చెందినట్లు గుర్తించింది. ఫారెస్ట్ ఏరియాలో చిరుత మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం చిరుత మృతి చెందినట్లు భావిస్తున్న అధికారుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చిరుత నోటిలోని పళ్ళు, పంజాలోని గోర్లు పీకేసినట్లు గుర్తించిన అధికారులు చిరుత ఎలా చనిపోయిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

వేటగాళ్ళ ఉచ్చుకు బలైనట్లు అనుమానిస్తున్నారు.ఘటన స్థలాలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఢీ కంపోజైన చిరుతకు మృతిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి జూనియర్ వైద్యులు, స్థానిక వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తుండగా చిరుత మృతికి గల కారణాలను అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుత మృతికి వేటగాళ్లు ఉచ్చు కారణమా లేక రైతులు పంటపొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అనారోగ్యంతో మృతి చెందిందా అని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యాకనే చిరుత మృతికి గల కారణాలు, వివరాలు తెలిసే అవకాశం ఉంది.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి