Rain Alert: కూల్ న్యూస్ అంటే ఇది.. వచ్చే మూడు రోజులు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Jul 07, 2024 | 1:30 PM

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది.. వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది..

Rain Alert: కూల్ న్యూస్ అంటే ఇది.. వచ్చే మూడు రోజులు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Follow us on

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది.. వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.. ఆంద్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావాతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఆదివారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

సోమవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మంగళవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఆదివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో కొన్నిచోట్ల వీచే అవకాశముంది.

సోమవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మంగళవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:-

ఆదివారం, సోమవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మంగళవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..