AP News: కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్..

| Edited By: Velpula Bharath Rao

Oct 20, 2024 | 4:52 PM

కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27 వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఇన్విటేషన్లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం జిల్లా కలెక్టర్ స్థానిక అధికారుల పేర్లు మాత్రమే ఉండడం చర్చకు దారి తీసింది. దీంతో ఇన్విటేషన్లో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరు ఎక్కడ? అని టీడీపీ నాయకులు సోషల్ మీడియాను వేదికగా ప్రశ్నిస్తున్నారు.

AP News: కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్..
Tdp Vs Ysrcp
Follow us on

చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఫౌండేషన్ డే ఇన్విటేషన్లో స్థానిక ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు పేరు లేదని కొందరు, కుప్పం వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదంటూ మరికొందరు ఇలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం వివాదంగా మారింది. కుప్పంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ కొనసాగుతోంది.

పోస్టర్లు వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి టీడీపీ వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. ఇరు ప్రార్టీల శ్రేణులు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కుప్పంలో రాజకీయం వేడెక్కింది. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27 వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఇన్విటేషన్లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం జిల్లా కలెక్టర్ స్థానిక అధికారుల పేర్లు మాత్రమే ఉండడం చర్చకు దారి తీసింది. దీంతో ఇన్విటేషన్లో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరు ఎక్కడ? అని టీడీపీ నాయకులు
సోషల్ మీడియాను వేదికగా ప్రశ్నిస్తున్నారు. ద్రవిడ యూనివర్సిటీ ఫౌండేషన్ డే ప్రోగ్రాంలో అధికారులు ప్రోటోకాల్ పాటించుకోకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ లోపు జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుకాగానే మరోవైపు వైసీపీ కుప్పం ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ ఎక్కడుంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేశాయి. ఎమ్మెల్సీ భరత్ కనబడుట లేదంటూ పోస్టులు పెట్టడంతో అధికార ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ సాగింది. వైసీపీ అధికారంలో ఉండగా అధికారాన్ని అనుభవించిన భరత్ కనిపించడం లేదంటూ కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి