AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnadevaraya Caste: శ్రీకృష్ణదేవరాయల కులం.. బలిజ-యాదవుల నంద్యాల వివాదం, విగ్రహావిష్కరణపై ఉత్కంఠ

Krishnadevaraya Caste: రాయలసీమలో కృష్ణదేవరాయల గురించి బహుశా తెలియని వారు చదవని వారు ఉండరేమో. ఆయన నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా సాక్షిభూతాలుగా ఉన్నాయి. అలాంటి పరిపాలకుడిని రాజనీతిజ్ఞుడిని కేవలం ఒక కులానికే పరిమితం చేస్తారా అనేవారు కూడా ఉన్నారు. మొత్తం..

Krishnadevaraya Caste: శ్రీకృష్ణదేవరాయల కులం.. బలిజ-యాదవుల నంద్యాల వివాదం, విగ్రహావిష్కరణపై ఉత్కంఠ
Krishnadevaraya Caste
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 5:16 PM

Share

Krishnadevaraya Caste: విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయుడిది ఏ కులం? మా కులస్తుడే అని బలిజలు అంటుంటే కాదు నా కులస్తుడే అని యాదవులు పట్టుబడుతున్నారు. నంద్యాల కేంద్రంగా జరుగుతున్న ఈ వివాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నంద్యాల శ్రీనివాస సెంటర్లో ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని బలిజ కులస్తులు ఏర్పాటు చేశారు. రేపు ప్రారంభం కావాల్సి ఉంది. మంత్రులు నిమ్మల రామానాయుడు స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఫరూక్ ఈ కార్యక్రమానికి రానున్నారు. అయితే కృష్ణదేవరాయలు బలిజ కులస్తుడు కాదని ఆయన యాదవ కులస్తుడు అని తమ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు.

ఒకవేళ విగ్రహాన్ని తమ ప్రమేయం లేకుండా ఆవిష్కరిస్తే అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా అదనపు పోలీసు అధికారి సీఐ లకు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదాస్పదమైంది. కృష్ణదేవరాయలు యాదవ కులస్తుడే అని చెప్పేందుకు పురావస్తు శాఖ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యాదవ సంఘం నేతలు పేర్కొన్నారు. దీనిపై బలిజ కులస్తులు భగ్గుమంటున్నారు. మొదటినుంచి కృష్ణదేవరాయలు బలిజ కులస్తుడే అని అందరికీ తెలుసని, యాదవులు కావాలనే దీనిపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. రేపు జరగాల్సిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విజయనగర పాలకుడు కృష్ణదేవరాయలు అంటే మానవజాతికే గౌరవం.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా రాయలసీమలో కృష్ణదేవరాయల గురించి బహుశా తెలియని వారు చదవని వారు ఉండరేమో. ఆయన నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా సాక్షిభూతాలుగా ఉన్నాయి. అలాంటి పరిపాలకుడిని రాజనీతిజ్ఞుడిని కేవలం ఒక కులానికే పరిమితం చేస్తారా అనేవారు కూడా ఉన్నారు. మొత్తం మీద పోలీస్ స్టేషన్కు చేరిన ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరగనిందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Follow Us