‘కరోనా పాజిటివ్ ఉన్నా పరీక్షలకు రావొచ్చు’

కడపజిల్లాలో రెండవ విడత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు. కోవిద్ పాజిటివ్ ఉన్నా పరీక్ష రాసేందుకు అనుమతి ఉందని...

'కరోనా పాజిటివ్ ఉన్నా పరీక్షలకు రావొచ్చు'
Follow us

|

Updated on: Sep 17, 2020 | 6:20 PM

కడపజిల్లాలో రెండవ విడత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు. కోవిద్ పాజిటివ్ ఉన్నా పరీక్ష రాసేందుకు అనుమతి ఉందని అలాంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 51 505 మంది అభ్యర్థులు పరీక్షలురాస్తున్నారన్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 843 ఖాళీలు ఉన్నాయని, సందేహాలు, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 6 క్లస్టర్లులో 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మహిళా అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. భారీ బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు పరీక్ష ప్రశ్నపత్రాల పంపిణీ చేయనున్నట్లు, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు.