ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలేఖ రాశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఇటీవల రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా కాపులు పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు తాజాగా ఈ లేఖ రాయడానికి గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ డబ్ల్యూ ఎస్ పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు అనుసరించి ఆర్టికల్ 342 A (3) ప్రకారం రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చు కేంద్రం నుంచి వచ్చిన సమాధానంను గుర్తు చేశారు. రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని కోరారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని లేఖలో కోరారు ముద్రగడ.
అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు ముద్రగడ. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారని లేఖలో పేర్కొన్నారు. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని గుర్తు చేశారు.
మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ప్రజలు దేవుళ్ళు లా భావించారు. పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలన్నారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలని సూచించారు. నా జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదన్నారు ముద్రగడ పద్మనాభం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం