Janasena Party: భీమ్లా నాయక్ విషయంలో జగన్ నియంతలా ప్రవర్తించారు.. నాదెండ్ల మనోహర్ ఆరోపణలు..

|

Feb 26, 2022 | 4:38 PM

Janasena Party: ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు(YCP Leaders), జనసేన నేతల(Janasena Leaders) మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ హీట్ ఎక్కిస్తోంది. తాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(PAC chairman Manohar) వైసీపీ..

Janasena Party: భీమ్లా నాయక్ విషయంలో జగన్ నియంతలా ప్రవర్తించారు.. నాదెండ్ల మనోహర్ ఆరోపణలు..
Janasena Pac Chairman Manoh
Follow us on

Janasena Party: ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు(YCP Leaders), జనసేన నేతల(Janasena Leaders) మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ హీట్ ఎక్కిస్తోంది. తాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(PAC chairman Manohar) వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారని ఆరోపణ చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు. అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే అని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహకారంతో సినిమా థియేటర్స్ వద్ద కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చారు. ప్రజాసమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం ఇస్తే.. సీఎం జగన్ ఇటువంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంతేకాదు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద చోటులో చేసుకున్న సంఘటనలు చూసి యావత్ ప్రపంచం ఆశ్ఛర్యపోయింది. ఎవరూ ఊహించని విధంగా క్షేత్ర స్తాయిలో అధికారం దుర్వినియోగం జరిగింది. సినీ పరిశ్రమని పోత్సహిస్తామని పెట్టుబడులు పెడితే.. రాయతీలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిన్న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా ప్రతి సినిమా థియేటర్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా కుట్ర చేయడం సిగ్గు చేటని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ తీరుని ఎద్దేవా చేశారు.

రెవెనూ సిబ్బంది తమ బాధ్యతలను పక్కకు పెట్టి.. తెల్లవారు జామునే సినిమా థియేటర్స్ వద్దకు ప,పంపించి.. ప్రత్యేకంగా సినిమా కు వచ్చే ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకు గురిచేయడానికి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించడం చాలా పొరపాటని అన్నారు. భీమ్లా నాయక్ సినిమాలో ఆత్మ గౌరవానికి, అహంభావానికి జరిగే పోరాటం ఉంది.. అంతిమ విజయం ఆత్మగౌరవనిదే.. సంకుచిత మనస్తత్వం, కక్షపూరితంగా నియంతలా వ్యవహరిస్తూ.. నా ఆలోచనల మేరకు పనిచేయాలనే భావంతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పక్కన పెట్టె సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కలసి నడిచేందుకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా నాదెండ్ల మనోహన్ పిలుపునిచ్చారు. అంతేకాదు సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలను చెప్పారు.

Also Read:  సమస్యలు, కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. శివరాత్రి రోజున ఈ స్తోత్రం చదవండి.. అద్భుతఫలితం మీ సొంతం..