ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది సర్కార్. ప్రజంట్ ఇస్తున్న రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజంట్ రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనునట్లు అధికారులు తెలిపారు. అక్కడ సక్సెస్ అయితే.. దశల వారీగా రాష్ట్రమంతటా ఈ విధానం అమలు అవ్వనుంది. ప్రజంట్ రేషన్ కార్డు ఉన్న.. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అయితే కరోనా అనంతరం ప్రజల మైండ్ సెట్ మారింది. ఎక్కువ ప్రొటీన్ ఫుడ్, బలవర్ధక ఆహారం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రైస్ బదులు పోషక విలువలున్న ఇతర ధాన్యాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి.. ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో.. గత నెల 18న సీఎం జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. బియ్యం కంటే రాగులు, జొన్నలకు అయ్యే ఖర్చే తక్కువ.. అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని సూచించారు.
రాగులు, జొన్నలకు సంబంధించి ఇప్పుటికే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసకున్నారు. మెజార్టీ ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. పంపిణీకి అవసరమైన రాగులు, జొన్నలను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును రూ.16 గా ఫిక్స్ చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మునిసిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధుమ పిండి అందజేస్తున్నారు. ఒక్కో కార్డుపై 2 కేజీల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని అందజేస్తారు.
బయట గోధుమ పిండి ధర రూ.40గా ఉంది. కానీ గవర్నమెంట్ రూ.16కే అందజేస్తోంది. ఏపీలోని మిగతా అన్ని జిల్లాలో గల కార్డు దారులకు సబ్సిడీ పై గోధుమపిండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..