AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

|

Jul 16, 2024 | 1:55 PM

నిన్నటి దక్షిణ ఒడిశా, పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం.. ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని విదర్భకు ఆనుకుని దాని అనుబంధ ఉపరితల అవర్తనం సగటున సముద్ర మట్టంకు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఋతుపవన ద్రోణి..

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Ap Rain Alert
Follow us on

నిన్నటి దక్షిణ ఒడిశా, పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం.. ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని విదర్భకు ఆనుకుని దాని అనుబంధ ఉపరితల అవర్తనం సగటున సముద్ర మట్టంకు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, రైసెన్, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని విదర్భ, గోపాల్‌పూర్ మీదుగా అల్పపీడన కేంద్రం గుండా ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. షీర్ జోన్ / గాలుల కోత ఇప్పుడు దాదాపుగా 19°N పొడవునా సముద్ర మట్టం 3.1 & 7.6 కిమీల మధ్య ఎత్తుతో దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. తాజా అల్పపీడనం జూలై 18న పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది.

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————————

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:-
—————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..