AP Weather: తెలంగాణలో జోరు వర్షం.. ఏపీలోనూ అదే సీన్ ఉటుందా..? ఇదిగో రిపోర్ట్

తెలంగాణలో వర్షం దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుందని వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు వర్షసూచన చేసింది.

AP Weather: తెలంగాణలో జోరు వర్షం.. ఏపీలోనూ అదే సీన్ ఉటుందా..? ఇదిగో రిపోర్ట్
Andhra Weather Report
Follow us

|

Updated on: Aug 20, 2024 | 1:57 PM

ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ఉంది. సోమవారం నాటి ఉపరితల ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి ఎగువన 0.9 కి.మీ వరకు విస్తరించి తక్కువగా గుర్తించబడింది.  సోమవారం నాటి ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు గుండా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు విస్తరించి తక్కువగా గుర్తించబడింది. ఈ క్రమంలో  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

మంగళవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

బుధవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

మంగళవారం, బుధవారం, గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

—————-

మంగళవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది

బుధవారం:-  తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది

గురువారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..