AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నావేంటక్కా.. అంత చిన్న విషయానికే ఇంత రియాక్ట్ అవ్వాలా?

ఈ మధ్యకాలంలో జనాలు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా రియాక్ట్‌ అవుతున్నారు. గోటలో పోయే విషయాన్ని కూడా గొడ్డలి దాకా వచ్చేలా లాగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఆన్‌లైన్ పేమెంట్స్ విషయంలో మొదలైన వివాదం ఒకరిపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఇంతకూ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నావేంటక్కా.. అంత చిన్న విషయానికే ఇంత రియాక్ట్ అవ్వాలా?
Online Payment Dispute
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 06, 2026 | 1:18 PM

Share

ఆన్ లైన్ పేమెంట్స్ కొన్ని సార్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. నెట్ సరిగా లేకపోవడం, ట్రాన్స్ ఫర్ చేసిన వెంటనే ఆ మొత్తం ఖాతాల్లో జమకాకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘర్షణే ఇద్దరి ఆడవాళ్ల మధ్య జరిగి ఏకంగా కత్తెరతో ఒకరిపై మరొకరు దాడి చేసి పరిస్థితికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గురవయ్య కాలనీలో అరుంధతి అనే మహిళ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తుంది. డెబ్బై ఏళ్ల వయస్సున్న ఆమె ఏన్నో ఏళ్లుగా ఈ దుకాణాన్ని నడుపుతుంది. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో అరుంధతి షాపుకు అదే కాలనీలో నివాసం ఉండే ప్రియాంక అనే యువతి వచ్చింది. షాపులో బట్టలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొనుగోలు చేసిన మొత్తాన్ని ఆన్ లైన్ పేమెంట్ చేసినట్లు అరుంధతికి చెప్పింది.

అయితే డబ్బులు వచ్చాయ లేదా అని అరుంధతి ఆన్‌ లైన్‌లో చెక్ చేసుకోగా ఆ మొత్తం కనిపించలేదు. దీంతో అరుంధతి ప్రియాంకతో డబ్బులు రాలేదని చెప్పింది. కానీ ప్రియాంక మాత్రం నేను అప్పుడే పంపాను అంటూ చెప్పింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రియాంక అక్కడే టెబుల్‌పై బట్టలు కడ్‌చేసే కత్తెర తీసుకొని అరుంధతిపై దాడి చేసింది. ఈ దాడిలో మెడపై, చేతిపై తీవ్ర గాయాలవ్వడంతో అరుంధతి గట్టిగా కేకలు వేసింది.

అమె కేకలు విని వెంటనే అక్కడి చేరుకున్న స్థానికువు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అరుంధతి షాపు వద్దకు చేరుకున్న పోలీసులు. రక్తపు మడుగులో ఉన్న అరుంధతిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రియాంక పొంతన లేని మాటలు చెబుతుండటంతో ఆమెను పిఎస్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..