AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: రోడ్డుపక్కన నిద్రిస్తున్న యాచకురాలిపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్!

ఒంటరిగా ఉంటున్న ఓ యాచకురాలిపై కన్నేసి ఆమెపై ఓ రౌడీ షీటర్‌ లైంగిక దాడికి ప్రయత్నించిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. నిందితుడిపై ఇప్పటికే రెండు అత్యాచారా కేసులు ఉన్నట్టు తెలిపారు.

Andhra News: రోడ్డుపక్కన నిద్రిస్తున్న యాచకురాలిపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్!
Beggar Woman Attacked, Rowdy Sheeter
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 12, 2026 | 6:16 PM

Share

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఓ యాచకురాలిపై ఓ కామాందుడు కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేయడంతో.. అతను అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు వైరల్ అవ్వడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఆటో నడుపుడంతో పాటు రౌడీ షీటర్‌గా సెటిల్‌మెంట్‌లు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనిపై ఇప్పటికే రెండు అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. అయితే రెండు రోజుల క్రితం పెదకాకానిలోని రోడ్డు పక్కనే ఉన్న పూల దుకాణంలో ఒక యాచకురాలు నిద్రిస్తుండడం ఇతను గమనించాడు. అమెపై కన్ననేసిన ఆ కామాందుడు అర్ధరాత్రి సమయంలో ఆమెకు వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే అతన్నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు నిందితుడు.

అయితే ఆమె ఏడుస్తూ కేకలు పెట్టడంతో కుక్కలు కూడా మొరగడం మొదలు పెట్టాయి. అలాగే స్థానికులు వస్తున్న అలికిడి కావడంతో ఆమెతో కొద్ది సేపు పెనుగులాడిన సాంబశివరావు అక్కడ నుండి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పెదకాకాని పోలీసులకు చేరవేశారు. దీంతో అక్కడే ఉన్న సిసి కెమెరా విజువల్స్ ను సేకరించిన పోలీసులు సాంబశివరావును గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే రెండు అత్యాచార కేసులున్నాయని గతంలో జైలుకు వెళ్లి వచ్చాడని సిఐ నారాయణ స్వామి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒకేసారి రూ.5 వేలు డౌన్.. పసిడి ధరల్లో భారీ మార్పులు..
ఒకేసారి రూ.5 వేలు డౌన్.. పసిడి ధరల్లో భారీ మార్పులు..
స్వీట్లు కావు.. రసాయనాలు.. ఎంత గొప్ప బ్రాండైనా లోపలంతా డొల్లే..
స్వీట్లు కావు.. రసాయనాలు.. ఎంత గొప్ప బ్రాండైనా లోపలంతా డొల్లే..
దీపావళి ఖర్చులపై నియంత్రణ ఎలా? ఆర్థిక భద్రత కోసం నిపుణుల సూచనలు!
దీపావళి ఖర్చులపై నియంత్రణ ఎలా? ఆర్థిక భద్రత కోసం నిపుణుల సూచనలు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం..
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం..
దీపావళి టపాసుల వల్ల గాయపడ్డారా..? రూ.25 వేలు ఫ్రీ
దీపావళి టపాసుల వల్ల గాయపడ్డారా..? రూ.25 వేలు ఫ్రీ