AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. సోమవారం వాయుగుండంగా మారే చాన్స్

|

Nov 24, 2024 | 12:45 PM

బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. సోమవారం వాయుగుండంగా మారే చాన్స్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు.
Follow us on

ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాతి రెండు రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29న భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీచేసింది. వాతావరణ శాఖ. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణం శాఖ హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌.

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..