Andhra Pradesh: ‘యువ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదు..’ ఇతని ఎడ్ల బండి యాత్రపై ఓ లుక్కేద్దాం పదండి..

| Edited By: Ram Naramaneni

Nov 24, 2024 | 12:25 PM

అన్నం పెట్టే రైతులకు పిల్లనిచ్చేవాళ్లు కరువయ్యారు. ఇలా అయితే వ్యవసాయం జోలికి ఎవరూ వెళ్లరు. ఇవే కాదు వ్యవసాయం చేసేవాళ్లకు చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించేందుకు ఎద్దుల బండి యాత్ర చేపట్టాడు ఓ యువకుడు.

Andhra Pradesh: యువ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదు.. ఇతని ఎడ్ల బండి యాత్రపై ఓ లుక్కేద్దాం పదండి..
Naveen on Bullock Cart
Follow us on

స్వలాభం కోసమో… పార్టీల మైలేజ్ కోసమో… రాజకీయ నాయకులు చేసే పాదయాత్రలు.. బస్సు యాత్రలు ఇప్పటివరకు మనం చూసాం… కొందరుతమ అభిమాన తారలను కలిసేందుకు చేసే సైకిల్ యాత్ర… బైక్ యాత్రలు కూడా చూశాం. కానీ ఎద్దుల బండిపై యాత్ర మీరు ఎప్పుడైనా చూసారా… శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు యువరైతు నవీన్ హిందూపురం నుంచి అమరావతికి ఎద్దుల బండిపై యాత్ర మొదలుపెట్టాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు… మహిళలపై జరుగుతున్న అకృత్యాలు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించేందుకు యాత్ర చేపడుతున్నట్లు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది… వ్యవసాయాన్ని నమ్ముకున్న యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని… పెళ్లిళ్లు కావడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను అంటున్నాడు నవీన్. యువ రైతులకు పెళ్లిళ్లు కావాలంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని… ఈ అన్ని వివరాలు సమగ్రంగా పవన్ కళ్యాణ్‌కు వివరించేందుకు ఎద్దుల బండి యాత్ర చేపట్టినట్లు  నవీన్ వెల్లడించాడు.

మొత్తం నెలరోజుల పాటు సాగే ఎద్దుల బండి యాత్రలో… రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు యాత్ర చేపట్టి నెల రోజుల్లో అమరావతిలోని పవన్ కళ్యాణ్‌ను కలుస్తాను అంటున్నాడు. ఎద్దుల బండిలో తన తిండికి కావలసిన పదార్థాలు, సామాన్లతో పాటు… దారిపొడవున వెళ్లే చోట ఎద్దుల కోసం రైతులను అడిగి పశుగ్రాసం తీసుకుంటున్నట్లు యువ రైతు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా నేటి యువతకు, సమాజానికి సందేశాన్ని అందించే విధంగా ఎద్దుల బండి చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రైతుల సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఎద్దుల బండి యాత్ర చేస్తున్నానని చెప్పడం వరకు బాగానే ఉంది…. యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని… పెళ్లిళ్లు కావడం లేదని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాననడంతో… వ్యవసాయం చేస్తున్న పెళ్లికాని ప్రసాదులకు యువ రైతు నవీన్ ఓ టార్చ్ బ్యారర్‌లా కనిపిస్తున్నాడట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..