Fortified Rice: ఏలూరిలో ప్లాస్టిక్ రైస్ కలకలం.. ఏది ప్లాస్టిక్ బియ్యం.. ఏది ఫోర్టిఫైడ్ బియ్యం క్లారిటీ ఇచ్చిన అధికారులు..

| Edited By: Surya Kala

Sep 21, 2023 | 9:22 AM

ఏలూరు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయని ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంపై జిల్లా అధికారులు స్పందించారు. రేషన్ బియ్యం లో వున్నది ప్లాస్టిక్ బియ్యం కాదని వాటిని ఫోర్టిఫైడ్ బియ్యం అంటారని వారు చెబుతున్నారు. రేషన్ బియ్యం లో ఈ పోర్టిఫైడ్ బియ్యం మిక్స్ చేయడం వలన అది ఆహారం గా తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి తెలిపారు.

Fortified Rice: ఏలూరిలో ప్లాస్టిక్ రైస్ కలకలం.. ఏది ప్లాస్టిక్ బియ్యం.. ఏది ఫోర్టిఫైడ్ బియ్యం క్లారిటీ ఇచ్చిన అధికారులు..
Rice Vs Plastic Rice
Follow us on

ఆకలి తీర్చే ఆహారం విషయంలో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వండుకునే బియ్యం నాణ్యత పరిశీలించి వంటకు ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో పేద, మధ్యతరగతి అంటే బిలో పావర్టీ లైన్ కు దిగువన ఉన్న వారికి ఇస్తున్న బియ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. మంచి పోషకాలను అందించాలనే ఉద్దేశ్యంతో నాణ్యమైన సన్న బియ్యం తో పాటు ఫోర్టిఫైడ్ రైస్ ను పంపిణీ చేస్తున్నారు. అయితే దీని వినియోగం ప్రజలకు అలవాటు లేకపోవటంతో అవి ప్లాస్టిక్ బియ్యం అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ముఖ్యంగా ఏలూరు జిల్లా అధికారులు అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల ఏలూరు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయని ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంపై జిల్లా అధికారులు స్పందించారు. రేషన్ బియ్యం లో వున్నది ప్లాస్టిక్ బియ్యం కాదని వాటిని ఫోర్టిఫైడ్ బియ్యం అంటారని వారు చెబుతున్నారు. రేషన్ బియ్యం లో ఈ పోర్టిఫైడ్ బియ్యం మిక్స్ చేయడం వలన అది ఆహారం గా తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి తెలిపారు. సాధారణంగా ఎంతోమంది గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్న వయసు పిల్లలలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. దాని కారణంగా రక్తహీనతకు గురవుతారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం పోషకాహార లోపం ద్వారా ఏర్పడే రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు పోషకాహార విలువలు కలిగిన ఫోర్టీఫైడ్ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు.

ఒక్క రేషన్ షాపులే కాకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడి సెంటర్లలో చిన్న పిల్లలకు , అలాగే ప్రభుత్వ పాఠశాలలలో గోరుముద్ద కార్యక్రమం ద్వారా పోషకాలు ఎక్కువగా ఉండే పోర్టిఫైడ్ బియ్యం కలిపిన ఆహార పదార్థాలను వారికి అందిస్తున్నారు. అయితే ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన లేకపోవడంతో ప్రజలు వాటిని ప్లాస్టిక్ బియ్యంగా అనుకుని భయపడుతున్నారు. ఎందుకంటే అవి చూడడానికి ఇంచుమించు బియ్యం ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ ముక్కల లాగా, తెల్లగా ఉంటున్నాయి. అలాగే ఆ బియ్యం కలిసిన పదార్థాలు తిన్నప్పుడు అది మెత్తగా ప్లాస్టిక్ లాగా సాగడంతో ప్రజలు వాటిని ప్లాస్టిక్ బియంగా భయపడుతూ.. వాటి వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన చెందారు. అయితే పోర్టిఫైడ్ బియ్యం తినడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందులో పుష్కలంగా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఫోర్టిఫైడ్ బియ్యం లో విటమిన్ బి 12, పోలిక్ యాసిడ్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి కెర్నెల్స్ గా రూపొందిస్తారు. అలా తయారుచేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని 100 కేజీల నాణ్యమైన రేషన్ బియ్యం లో ఒక కేజీ ఫోర్టిఫైడ్ బియ్యం కెర్నెల్స్ ను కలుపుతారు. వీటిని నీటిలో వేసిన తర్వాత కెర్నెల్స్ పైకి తేలుతాయి. వీటిని తయారు చేసేందుకు ప్రభుత్వానికి ఒక కేజీకి రూ.75 వరకు ఖర్చు అవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చుకు వెనకాడకుండా అందరికీ పూర్తి పోషకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తుంది. అయితే వీటిపై అవగాహన చర్యలు చేపట్టి ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించాలని అధికారులు తమ సిబ్బందికి ఆదేశిస్తున్నారు.

అయితే ఒక్క ఏలూరు జిల్లాలోనే 6 లక్షల 42 వేల 526 రేషన్ కార్డులు ద్వారా 9 వేల 300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జులై 1 వ తేదీ నుంచి అందిస్తున్నారు. అలాగే 2280 అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు, గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలలో జగనన్న గోరుముద్ద పధకం కింద ఫోర్టీఫైడ్ బియ్యంతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. ఫోర్టీఫైడ్ బియ్యం వినియోగం కారణంగా పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు తొలగి, పిల్లలలో నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే అధికారులు ఇప్పటికే ఫోర్టీఫైడ్ బియ్యం వాడటం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఫోర్టీఫైడ్ బియ్యంపై అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందరికీ తెలిసేలా ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..