Rajamahendravaram: వారెవ్వా.. రాజమండ్రి గోదావరి తీరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌

|

Oct 27, 2024 | 9:36 PM

రాజమండ్రి గోదావరి తీరంలో బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం టూరిజం హబ్‌గా అడుగులేస్తోందన్నారు మంత్రి కందుల దుర్గేష్‌. పర్యాటకానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు.

Rajamahendravaram: వారెవ్వా.. రాజమండ్రి గోదావరి తీరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌
Floating Restaurant
Follow us on

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ ప్రారంభించారు పర్యాటక మంత్రి కదులు దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే బత్తుల. ప్రతి రోజూ మధ్యాహ్నం, సాయంత్రం దాదాపు 300 నుంచి 400 మంది వరకు కూడా టూరిస్టులు బోటులో ప్రయాణం చేయొచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులతో పాటు రాజమండ్రి చుట్టుపక్కలున్న వారు కూడా గోదావరి మధ్యలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. శాఖాహారం, మాంసాహారంతో పాటు గోదావరి రుచులను కుటుంబ సమేతంగా సేదతీరుతూ ఎంజాయ్ చేయొచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. బయట రెస్టారెంట్‌లో ఏ రకంగా సెటప్ ఉంటుందో దానికి మించి ఈ బోట్‌ రెస్టారెంట్ ఉంటుందంటున్నారు. ఈ ఫ్లోటింగ్​ రెస్టారెంట్​ కిట్టీ పార్టీలు, బర్త్ డే ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు సైతం అనువుగా ఉంటుందని యాజమాన్యం తెలిపింది.

టూరిజం హబ్‌గా రాజమహేంద్రవరం ఒక్కొక్కటిగా అడుగులేస్తుందన్నారు మంత్రి కందుల దుర్గేష్‌. గతంలో ఎక్కడా పర్యాటక అభివృద్ధి కనిపించలేదని.. ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా టూరిజం మంత్రి పెట్టుకున్నారన్నారు. పర్యాటకానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని.. గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక దేవాలయాలపై ఒక కమిటీ కూడా వేశారన్నారు. ఇప్పటికే ఆరు పుణ్యక్షేత్రాలకు రాజమండ్రి నుండి ఆధ్యాత్మిక బస్సులు ప్రారంభించామన్నారు. వచ్చే నెలలో పిచ్చుక లంకలో రిస్టార్స్‌పై ఒబేరాయ్ సంస్థతో మరోసారి చర్చించబోతున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..