సముద్రంలో తిరగబడిన బోటు.. మత్స్యకారులకు తప్పిన పెను ప్రమాదం..

తెలుగురాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని హర్బర్స్‎లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‎లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం వేటకు వెళ్లిన బోట్లు కూడా తిరిగి వస్తున్నాయి.

సముద్రంలో తిరగబడిన బోటు.. మత్స్యకారులకు తప్పిన పెను ప్రమాదం..
Bapatla
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 21, 2024 | 5:44 PM

తెలుగురాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని హర్బర్స్‎లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‎లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం వేటకు వెళ్లిన బోట్లు కూడా తిరిగి వస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లకుండానే మత్స్యకారులు తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలోనే నిజాంపట్నం హార్బర్ నుండి ముగ్గరు మత్స్యకారులతో వెళ్లిన ఫైబర్ బోటు మొగ వద్ద తిరగబడింది. పెద్ద పెద్ద అలలు ఎగిసి పడటంతోనే పడవ బోల్తాపడిందని చెబుతున్నారు మత్స్యకారులు. పడవలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే సముద్రంలో పడిపోయారు. అయితే అదే సమయంలో అటు నుండి వస్తున్న మరో పడవలోని మత్స్యకారులు వీరిని గమనించారు. వెంటనే సముద్రంలోకి దూకి ఒడ్డుకు తీసుకొచ్చి వారి ముగ్గరిని రక్షించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం సముద్రంలో అలలు ఎగిసి పడుతుండటంతోనే బోటు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో నాలుగు రోజుల వేటలో పట్టుకున్న మత్స్య సంపద, వలలు, బోటు అన్ని కొట్టుకుపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..