Andhra Pradesh: అయ్యో ఎంతపనైంది.. టీ తాగి తిరిగిరాని లోకాలకు దంపతులు.. అసలు ఏం జరిగిందంటే..

|

Sep 14, 2024 | 6:07 PM

వృద్ధ దంపతులు.. ఆయనకు 75 ఏళ్లు.. ఆమెకు 70 ఏళ్లు.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. వయసు పై బడింది.. చూపు మందగించింది.. ఈ క్రమంలోనే అనుకోకుండా జరిగిన ఓ పొరపాటు ఇద్దరూ చనిపోయేలా చేసింది.. కళ్లు కనిపించకపోవడంతో ఆమె అనుకోకుండా అక్కడ ఉన్న రసాయన గుళికలతో టీ కాచింది.

Andhra Pradesh: అయ్యో ఎంతపనైంది.. టీ తాగి తిరిగిరాని లోకాలకు దంపతులు.. అసలు ఏం జరిగిందంటే..
Tea (representative image)
Follow us on

వృద్ధ దంపతులు.. ఆయనకు 75 ఏళ్లు.. ఆమెకు 70 ఏళ్లు.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. వయసు పై బడింది.. చూపు మందగించింది.. ఈ క్రమంలోనే అనుకోకుండా జరిగిన ఓ పొరపాటు ఇద్దరూ చనిపోయేలా చేసింది.. కళ్లు కనిపించకపోవడంతో ఆమె అనుకోకుండా అక్కడ ఉన్న రసాయన గుళికలతో టీ కాచింది. టీ పొడి అనుకుని పొరపాటున గుళికలను వేసింది. అనంతరం దంపతులిద్దరూ ఆ టీని తాగారు.. చివరకు ఇద్దరూ ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది. టీ తాగిన కొన్ని నిమిషాలకే.. వృద్ధ దంపతులు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ఘటన పల్లకడియం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుచూరి గోవింద్ ( 75 ) , అప్పాయమ్మ ( 70 ) వృద్ధ దంపతులు… ఇద్దరికీ చూపు సరిగా కనిపించదు.. టీ పొడి అనుకుని పొరపాటున గుళికలును వేసుకొని వృద్ధ దంపతులు టీ కాచుకున్నారు. అయితే.. టీ తాగిన కొద్దిసేపట్లో నోటి నుండి నురగలు కక్కుతూ గోవింద్, అప్పాయమ్మ ఇద్దరూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు.

దీంతో వృద్ధ దంపతులను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. కొన్ని రోజులు కిందట కోతులు గుళికల ప్యాకెట్ ను ఇంటి బయట పడేయగా.. ఆ ప్యాకెట్ టీ పొడి అనుకుని ఇంట్లో పెట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

కాగా.. అప్పాయమ్మకు కంటి చూపు మందగించడంతో టీ పొడికి బదులు గుళికలను వేసి కాచినట్లు పేర్కొంటున్నారు. ఆ టీని వృద్ధ దంపతులు తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని గ్రామస్థులు తెలిపారు. వృద్ధ దంపతులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..