AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒకే ఒక్క ఫోన్ కాల్.. రూ.2 కోట్లు స్వాహా.. తాడేపల్లిలో ఏం జరిగిందంటే..?

డిజిటల్ అరెస్ట్ పేరుతో తాడేపల్లిలో వృద్ధ దంపతులు భారీ సైబర్ మోసానికి గురయ్యారు. బెంగళూరు పోలీసులమని, సీబీఐ విచారణ, అరెస్ట్ వారెంట్ అంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు.. వారి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను వెనక్కి తీసుకునేలా చేసి రూ.2 కోట్లకు పైగా తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

Andhra: ఒకే ఒక్క ఫోన్ కాల్.. రూ.2 కోట్లు స్వాహా.. తాడేపల్లిలో ఏం జరిగిందంటే..?
Tadepalli
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 14, 2026 | 12:39 PM

Share

ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. పోలీసులమని ఫోన్ చేసి బెదిరించడం.. కేసులు, అరెస్టుల పేరుతో భయపెట్టడం.. చివరకు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం.. ఇదే వారి మోసాల స్టైల్! తాజాగా తాడేపల్లిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ వృద్ధ దంపతులను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి.. వారి నుంచి రూ.2 కోట్లకు పైగా కాజేశారు.

పోలీసులమంటూ ఫోన్.. కేసుల పేరుతో బెదిరింపులు!

తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలకృష్ణ, ఆయన భార్య నళినీదేవి నివసిస్తున్నారు. వీరిద్దరి పేర్లపై మ్యూచువల్ ఫండ్స్‌లో దాదాపు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. గత నెల 20న బాలకృష్ణకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సై సందీప్ రావు మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ భార్య నళినీదేవి అమ్మాయిలకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు తీసి ఇతరులకు పంపుతున్నారని ఆరోపించాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 17 కేసులు నమోదయ్యాయని చెప్పి దంపతులను భయపెట్టాడు. విచారణ కోసం వెంటనే బెంగళూరుకు రావాలని ఆదేశించాడు.

సీబీఐ విచారణ.. అరెస్ట్ వారెంట్ అంటూ భయం!

వయసు పైబడటంతో బెంగళూరుకు రాలేమని దంపతులు చెప్పగా.. మరో అధికారితో మాట్లాడాలంటూ ఫోన్‌ను సీఐ రాహుల్ చౌదరికి కలిపాడు. విచారణకు హాజరుకావాల్సిందేనని అతడు ఒత్తిడి చేశాడు. అంతేకాదు.. బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసిన బ్యాంకు ఖాతాల్లో నళినీదేవి పేరు కూడా ఉందని ఆరోపించాడు. తమకు ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని దంపతులు చెప్పినా నిందితులు వినిపించుకోలేదు. సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకున్నామని, కేసును సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు. వాట్సాప్‌లో వారెంట్, సమన్లు పంపించామని నమ్మించారు.

మ్యూచువల్ ఫండ్స్ క్లోజ్ చేసి.. డబ్బులు బదిలీ!

ఆ తర్వాత అసలు ప్లాన్ అమలు చేశారు. మ్యూచువల్ ఫండ్ ఖాతాలను పరిశీలించాలంటూ వాటిని క్లోజ్ చేసి, అందులోని డబ్బును తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు పంపించాలని ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత మొత్తం డబ్బును తిరిగి జమ చేస్తామని నమ్మబలికారు. దీంతో భయపడిపోయిన దంపతులు గత నెల 31న తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను వెనక్కి తీసుకుని.. విజయవాడ గాంధీనగర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు నగదు బదిలీ చేశారు. ఇలా రూ.2 కోట్లకు పైగా వారి చేతుల్లో పెట్టారు.

డబ్బులు తిరిగి రాకపోవడంతో అనుమానం!

కొన్ని రోజులైనా డబ్బులు తిరిగి రాకపోవడంతో దంపతులకు అనుమానం వచ్చింది. తాము మోసపోయామని గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుంచుకోండి.. ఫోన్ లేదా వీడియో కాల్‌లో ఎవరైనా పోలీసులమని చెప్పి అరెస్ట్ చేస్తామని బెదిరించినా నమ్మకండి. ‘డిజిటల్ అరెస్ట్’ అనేది చట్టంలో లేదు. భయపడి డబ్బులు బదిలీ చేయకండి. వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పి, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో