AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తీరం వైపుగా తుఫాన్.. రాబోయే 3 రోజుల వాతావరణంపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌..

తెలుగురాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుఫాన్ మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Weather Report: తీరం వైపుగా తుఫాన్.. రాబోయే 3 రోజుల వాతావరణంపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌..
Cyclone Alert For Ap And Telangana
Anand T
|

Updated on: Oct 24, 2026 | 6:18 PM

Share

తూర్పు మధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం, దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 25న మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 ఉదయం నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఇది మరింత బలపడి అక్టోబర్ 28, 2026 ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం:

వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలోని పలు జిల్లాల్లో తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది. ఆది, సోమవారాల్లోనూ ఈ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమలో వాతావరణం

ఇక రాయలసీమలో శనివరాం తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారే క్రమంలో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని.. వీటి ప్రభావంతో ఆటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. సోమవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శుక్రుడి అనుగ్రహం.. ఆ రాశులకు చెందిన మహిళలకు మహా భాగ్య యోగం
శుక్రుడి అనుగ్రహం.. ఆ రాశులకు చెందిన మహిళలకు మహా భాగ్య యోగం
తీరం వైపుగా తుఫాన్.. తెలుగురాష్ట్రాల వాతావరణంపై వెదర్ రిపోర్ట్
తీరం వైపుగా తుఫాన్.. తెలుగురాష్ట్రాల వాతావరణంపై వెదర్ రిపోర్ట్
ప్రభాస్ సలహా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ప్రభాస్ సలహా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఈషా ఔట్‌రీచ్‌ మద్దతుతో అన్నదాతల అద్భుతం.. .400 కోట్ల వ్యాపారంతో..
ఈషా ఔట్‌రీచ్‌ మద్దతుతో అన్నదాతల అద్భుతం.. .400 కోట్ల వ్యాపారంతో..
ఒకరిద్దరు కాదు.. కివీస్‌కు చుక్కలు ముగ్గురు మొనగాళ్లు.!
ఒకరిద్దరు కాదు.. కివీస్‌కు చుక్కలు ముగ్గురు మొనగాళ్లు.!
టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులపై అప్డేట్
టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులపై అప్డేట్
పీఎం కిసాన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా..?
పీఎం కిసాన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా..?
వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..12 రాశులకు వారఫలాలు
వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..12 రాశులకు వారఫలాలు
ఆయుధ పూజరోజూ AK47తో కాల్పులు.. ఎస్పీ అంకితా శర్మకు షాక్!
ఆయుధ పూజరోజూ AK47తో కాల్పులు.. ఎస్పీ అంకితా శర్మకు షాక్!
లోన్ తీసుకునేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
లోన్ తీసుకునేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..