AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. చెరువులో మొసలి ప్రత్యక్షం.. దెబ్బకు దండోరా వేయించారు..

బాపట్ల జిల్లా పర్చూరు మండలం గార్నెపూడి గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. సుమారు నాలుగు అడుగుల పొడవున్న మొసలి గ్రామంలోని మంచినీటి చెరువులో కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గ్రామంలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులు, గొర్రెల కాపరులు చెరువు వైపు వెళ్లవద్దని సూచించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వరద నీటితో మొసలి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. చెరువులో మొసలి ప్రత్యక్షం.. దెబ్బకు దండోరా వేయించారు..
Crocodile Spotted In Garnipudi Village Pond
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 6:30 PM

Share

బాపట్ల జిల్లా పర్చూరు మండలం గార్నెపూడి గ్రామంలో ఓ మొసలి కలకలం సృష్టించింది. శుక్రవారం మద్యాహ్నం చెరువు గట్టుమీద నడుస్తున్న కొందరు గ్రామస్థులకు మొసలి చెరువులో సంచరిస్తూ కనబడింది. మొసలిని చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్థులు అందరూ చెరువు దగ్గరకు చేరుకున్నారు. కొద్దిసేపు అనంతరం మొసలి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. గార్నెపూడి గ్రామంలోని చెరువులో మొసలి ఉందన్న సమాచారం అందుకున్న గర్నెపూడి వీఆర్వో అనూష చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మంచినీటి చెరువులో మొసలి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

పర్చూరు తహశీల్దార్ బ్రహ్మయ్య, ఎస్సై అంకమ్మరావు హుటాహుటిన గర్నెపూడి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేశారు. సుమారు నాలుగు అడుగుల పొడవు ఉన్న మొసలి చెరువులో కనబడటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్థులు ఎవరూ చెరువు వద్దకు వెళ్ళకుండ గ్రామంలో దండోరా వేయించారు.

Crocodile Spotted In Garnipudi Village Pond

Crocodile Spotted In Garnipudi Village Pond

పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువు వద్దకు ఎవరూ వెళ్లకుండ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల మురసు తుఫాన్ తో భారీ వర్షాలు కురిశాయి.. ఈ సందర్భంగా వచ్చిన వరదలకు మొసలి కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు . వరద నీటితో నిండిన చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..
ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..
OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు
OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..
'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో