Cooking Oil Prices: సంక్రాంతి అంటేనే పిండి వంటకాల పండగ. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు పిండి వంటకాలు చేసుకొని ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు. పిండి వంటలు చేయడానికి మహిళలు విముఖత చూపుతున్నారు. కారణం ఏంటంటే వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడమే.
కరోనా వల్ల అసలే నిత్యావసరాల ధరలు అధికంగా పెరిగిపోయాయి. చేతిలో డబ్బులు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు వంట నూనెలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో పిండి వంటలు చేయాలంటే విముఖత చూపుతున్నారు. నూనె ధరలు స్థాయికి మించి పెరగడంతో సామాన్య ప్రజలు కొనలేక సతమతమవుతున్నారు. గత నెలలో పల్లీ నూనె రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.150కి పెరిగింది. సన్ ఫ్లవర్ రూ. 120 నుంచి రూ. 135కి పెరిగింది. పామాయిల్ రూ. 100 నుంచి రూ. 120కి చేరింది. అవేకాక ఇతర నూనెల ధరలు కూడా పెరిగి పోయాయి. సంక్రాంతి అంటేనే పిండి వంటల పండుగ. సకినాలు, గారెలు, మురుకులు, లడ్డూలు, అరిసెలు లాంటి వివిధ రకాలైన పిండి వంటలు చేసుకుంటారు. ఈ పదార్థాల్లో ఏది చేయాలన్నా నూనె తప్పనిసరి. కాగా, నూనెల ధరలు పెరిగితే చేసేదెలా అని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.
Cooking Oil Price: వంటింట్లో నూనె ధర మంట… లీటర్ ఆయిల్ రేటు రూ.150కు చేరే అవకాశం…