AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా భద్రత కోసం దిశ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఈరోజు నిర్వహించనున్న ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించనున్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై సీఎం జగన్ వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొంటారు
ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఈరోజు ఉదయం 10గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం సీఎం జగన్ ఐదుగురు మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో వీక్షించనున్నారు. ఈ సందర్భంగా దిశ యాప్ ఆవశ్యతను వారికి సీఎం జగన్ స్వయంగా వివరించనున్నారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందనేది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి తెలియజేయనున్నారు.
Also Read: