YS Jagan: ఆ ఘనత చంద్రబాబుది.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు..

|

Apr 15, 2024 | 9:05 PM

విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై వైసీపీ అధినేత, సీఎం జగన్ గుడివాడ సభలో స్పందించారు. ఒక్క రాయి వేసినంత మాత్రాన తన సంకల్పం చెక్కు చెదరదన్నారు. రాయివేసేంత వరకు దిగజారారంటే వాళ్లు ఓటమి దగ్గరున్నారని అర్థం. అలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు సీఎం జగన్.

YS Jagan: ఆ ఘనత చంద్రబాబుది.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు..
Ys Jagan
Follow us on

జగన్‌ అనే అర్జునుడుకి ప్రజలనే కృష్ణుడి అండ ఉంది.. ఒక్కరాయితో పెత్తందార్ల ఓటమిని, పేదల గెలుపును ఆపలేరు.. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రాన్ని కౌరవులు గెలిచినట్లా..? ఒక రాయి వేసినంత మాత్రాన దుష్టచతుష్టయం గెలిచినట్లు కాదు.. రాయి వేసినంత మాత్రాన నా సంకల్పం చెక్కు చెదరదు..రాయివేసేంత వరకు దిగజారారంటే వాళ్లు ఓటమి దగ్గరున్నారని అర్థం.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి గుడివాడ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై వైసీపీ అధినేత, సీఎం జగన్ గుడివాడ సభలో స్పందించారు. ఒక్క రాయి వేసినంత మాత్రాన తన సంకల్పం చెక్కు చెదరదన్నారు. రాయివేసేంత వరకు దిగజారారంటే వాళ్లు ఓటమి దగ్గరున్నారని అర్థం. అలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ సీఎం జగన్ చెప్పారు.

రాయి వేసి విపక్షాల వాళ్లు తనకు చేసిన గాయం పదిరోజుల్లో తగ్గుతుందని జగన్ అన్నారు. కానీ, మోసపు పాలనతో చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అంటూ విమర్శించారు. ఆయా సామాజిక వర్గాలకు, రైతులకు, విద్యార్థులకు, పేదలకు తాను చేసిన సేవను ఎప్పటికీ మర్చిపోరన్నారు. కుట్రలు చేయడం గాయపేట్టడం మోసం చేయడం చంద్రబాబు నైజం అని.. ప్రతి ఇంటికి మంచి చేయడం తన నైజం అన్నారు.

కిలో బియ్యం రెండు రూపాయలకు ఇవ్వొద్దని ఎన్టీఆర్ ను దింపిన ఘనత చంద్రబాబుది అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది చంద్రబాబు.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్నది చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబు అంటూ పేర్కన్నారు. ఎన్టీఆర్ ను అవమానిస్తారు.. మళ్లీ ఫోటోకు దండలు వేస్తారంటూ మండిపడ్డారు. 58 నెలల మన ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెడుతున్నానని.. తనను మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…