AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!

Chittoor Grandparents Sacrifice Lives: చిత్తూరు జిల్లా గంగవరానికి చెందిన శ్రీనివాసులు శెట్టి, దేవి దంపతులు పూరి జగన్నాథుడి దర్శనానికి వెళ్లి విషాదానికి గురయ్యారు. బైతరణి నదిలో మునిగిపోతున్న ఆరేళ్ల మనవరాలిని కాపాడే ప్రయత్నంలో వారు ప్రాణాలు కోల్పోయారు. మనవరాలిని ఒడ్డుకు విసిరి తాము నది ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటనతో గంగవరం శోకసంద్రంలో మునిగిపోయింది. వారి త్యాగానికి గ్రామస్తులు నివాళులర్పించారు.

మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
Grandparents Save Granddaughter
Raju M P R
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 8:56 PM

Share

Puri Tragedy: చిత్తూరు జిల్లా గంగవరంలో విషాదం చోటు చేసుకుంది. పూరి జగన్నాథుడి దర్శనానికి వెళ్లిన దంపతులు మృత్యువాత పడటంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న మనవరాలిని కాపాడబోయి.. అవ్వ తాత మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయింది. వివరాల్లోకి వెళితే.. గంగవరం మండలం మేలుమాయి క్రాస్ వద్ద శ్రీనివాసులు శెట్టి దేవి దంపతులు రైస్ మిల్ నిర్వహిస్తున్నారు. శ్రీనివాసులు శెట్టి దేవి దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు.

పిల్లలతో కలిసి పూరి జగన్నాథుడి దర్శనం చేసుకోవాలని భావించిన శ్రీనివాసులు శెట్టి దేవి దంపతులు.. నవంబర్ 10న బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లైట్‌లో భువనేశ్వర్ చేరుకున్నారు. పూరి జగన్నాథుడి దర్శనానికి బయలుదేరిన శ్రీనివాసులు శెట్టి కుటుంబం.. బైతరణీ నదిలో నదీ స్నానం కోసం వెళ్లారు. నదీలో నీటి ప్రవాహ ఉధృతి కొనసాగుతుండగా అక్కడే ఆడుకుంటున్న ఆరేళ్ల మనవరాలు యశస్వి ప్రమాదానికి గురైంది. కళ్ళముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనవరాలిని కాపాడే ప్రయత్నంలో శ్రీనివాసులు శెట్టి, దేవి దంపతులు నదిలోకి దిగారు. కొట్టుకుపోతున్నమనవరాలిని కాపాడే ప్రయత్నం చేసిన అవ్వ తాత.. ఎట్టకేలకు ఆరేళ్ల మనవరాలిని నది ఒడ్డుకు విసిరేశారు. అయితే ఆ నది నీటి ఉధృతికి వారు నిలబడలేకపోయారు. ఎదురొడ్డి ఒడ్డు కు చేరుకోలేక పోయారు.

నదిలో నీటి ప్రవాహానికి శ్రీనివాసులు శెట్టి దేవీ దంపతులు కొట్టుకుపోయారు. కొడుకులు, కోడళ్ళు కూతుళ్లు చూస్తుండగానే గల్లంతైపోయారు. కనుచూపు మేరలో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం దాదాపు మూడు గంటల పాటు గాలించి నదిలో నుంచి ఆ దంపతుల మృతదేహాలను బయటికి తీశారు. పూరి జగన్నాథుని దర్శనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న శ్రీనివాసులు శెట్టి దేవి దంపతుల డెడ్ బాడీలను స్వగ్రామానికి చేరుకోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గ్రామానికి చేరుకున్న మృతదేహాలకు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తో పాటు పలువురు నివాళులు అర్పించగా బంధువులు అంత్యక్రియలను పూర్తి చేశారు.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో