AP Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో భారీ వర్షానికి ఛాన్స్..!

|

Aug 01, 2022 | 3:13 PM

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితికి సంబంధించి రిపోర్ట్‌ను అమరావతి వాతారణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం రానున్న మూడు రోజులపాటు..

AP Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో భారీ వర్షానికి ఛాన్స్..!
Ap Rains
Follow us on

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితికి సంబంధించి రిపోర్ట్‌ను అమరావతి వాతారణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం రానున్న మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ నివేదికలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. నిన్న ఏర్పడిన ఉత్తర -దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి కొమరిన్ వరకు తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు గుండా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు విస్తరించి.. ఇవాళ కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఇక నిన్న రాయలసీమ, పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగి ఇవాళ కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాలకు విస్తరించింది.

రాబోయే మూడు రోజులకు సంబంధించి వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జుల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

రాయలసీమలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంటుందన్నారు. ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయన్నారు. అలాగే ఉరుములతో కూడిన, భారీ వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని తెలిపారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..