YS Viveka Case: ఎంపీ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. ఆ డేట్‌లో రావాలంటూ..

|

Jan 25, 2023 | 5:57 PM

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈసారి 41ఏ కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ.

YS Viveka Case: ఎంపీ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. ఆ డేట్‌లో రావాలంటూ..
Mp Avinash Reddy
Follow us on

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈసారి 41ఏ కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. అంతేకాదు.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది సీబీఐ. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంది. ఈ మేరకు నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వగా.. ఒక్క రోజులో నోటీసులు ఇచ్చి రమ్మంటే ఎలా? అంటూ ప్రశ్నించారు ఎంపీ. సమయం లేదంటూ విచారణకు వెళ్లలేదు. దాంతో సీబీఐ మళ్లీ నోటీసులు జారీ చేసింది.

2019లో వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు విచారణ మూడేళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. లేటెస్ట్‌గా ఎంపీ అవినాష్‌ రెడ్డికి 41ఏ కింద నోటీసులివ్వడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మొన్నటి నోటీసులకు విచారణకు హాజరు కానంటూ బదులిచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి.. ఈసారైనా వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..