Andhra Pradesh: మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు.. అందరూ కలిసి..

|

Nov 14, 2021 | 1:21 PM

Andhra Pradesh: ఆ యువతి యువకుడికి కొద్ది రోజుల కిందటే పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇరు కుటుంబాల వారు పెళ్లి పత్రికలను ప్రింట్ చేసి పంపకాలు కూడా జరిపారు.

Andhra Pradesh: మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు.. అందరూ కలిసి..
Bride
Follow us on

Andhra Pradesh: ఆ యువతి యువకుడికి కొద్ది రోజుల కిందటే పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇరు కుటుంబాల వారు పెళ్లి పత్రికలను ప్రింట్ చేసి పంపకాలు కూడా జరిపారు. పెళ్లి కోసం ఫంక్షన్ హాల్‌ను బుక్ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా ముందు రోజే రిసెప్షన్ నిర్వహించారు. అప్పటి వరకు పెళ్లి కొడుకుతోనే ఉన్న పెళ్లి కూతురు.. తీరా మరికాసేపట్లో పెళ్లి అనగా ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది. ఉన్నపళంగా ఇంటి నుంచి జంప్ అయ్యింది. పెళ్లి కూతురు ఇచ్చిన ట్విస్ట్‌కి పెళ్లి కొడుకు సహా.. ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కంగుతిన్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం తట్టివారి పల్లికి చెందని సోనికకు, అదే మండలం విజయ నగర్ కాలనీకి చెందిన నవీన్ కుమార్‌కు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇరు కుటుంబాలు చేశాయి. ఇవాళ తెల్లవారు జామున వీరి పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం రాత్రి సంఘం కళ్యాణ మండపంలో జరిగిన రిసెప్షన్‌లోనూ పెళ్లి కొడుకు నవీన్‌తో కలిసి ఉంది పెళ్లి కూతురు సోనిక. అయితే, తెల్లవారు జామున ముహూర్తం సమయం ముందు అదృశ్యం అయ్యింది. సోనిక తాను ప్రేమించిన యువకుడితో వెళ్లి పోయినట్లుగా బంధువులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పెళ్లి కొడుకు తరఫున కుటుంబ సభ్యులు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సోనిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Also read:

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు.. అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాణ సంస్థ.. ట్వీట్ వైరల్..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..