చంద్రబాబు పచ్చి అవకాశవాది- అమిత్‌ షా

నర్సారావుపేట: సీఎం చంద్రబాబుపై బీజేపీ అధినేత అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాదని మండిపడ్డారు. 2004లో బీజేపీ ఓడిపోగానే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని, 2014లో మోడీ జోరు చూసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. నర్సరావుపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసం తప్ప.. ఏపీ కోసం చంద్రబాబు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.  ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, కాంగ్రెస్‌కు […]

చంద్రబాబు పచ్చి అవకాశవాది- అమిత్‌ షా
Follow us

|

Updated on: Apr 04, 2019 | 8:00 PM

నర్సారావుపేట: సీఎం చంద్రబాబుపై బీజేపీ అధినేత అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాదని మండిపడ్డారు. 2004లో బీజేపీ ఓడిపోగానే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని, 2014లో మోడీ జోరు చూసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. నర్సరావుపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసం తప్ప.. ఏపీ కోసం చంద్రబాబు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.  ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, కాంగ్రెస్‌కు సీట్లు రాకపోతే మళ్లీ కాంగ్రెస్‌ను వదిలేస్తారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు వస్తారని, ఎన్డీఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని అన్నారు. అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణమైనా జరిగిందా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.7వేల కోట్లు ఇస్తే… చంద్రబాబు ఆయన మంత్రులు దోచుకున్నారని ఆరోపించారు.