సంక్షోభంలో ఉన్న నాపరాతి గనుల పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గనుల లీజ్ రెన్యువల్ చార్జీలను భారీ ఎత్తున తగ్గించింది. అంతేగాక వారికి రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. దీంతో నాపరాతి గనుల పైన ఆధారపడిన యజమానులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నంద్యాల జిల్లా బనగానపల్లె, డోన్ నియోజకవర్గం నాపరాతి గనులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. కడప, ప్రకాశం జిల్లాలో కూడా నాపరాతి గనులు విస్తరించి ఉన్నాయి. వీటిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి . నాపరాళ్ల ను ఒకప్పుడు విరివిరిగా ఉపయోగించేవారు. అయితే ఈ నాపరాతి పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గ్రానైట్, టైల్స్ , మార్బుల్స్ తదితర టోన్స్ వినియోగంలోకి రావడంతో మార్కెట్లో నాపరాయికి డిమాండ్ తగ్గింది.
దీనికి తోడు ప్రభుత్వం పన్నులు, విద్యుత్ చార్జీలు, ప్లీజ్ రెన్యూవల్ చార్జీలు, రాయల్టీ లతో భారం అధికమైంది. దీంతో నాపరాతి గనుల పరిశ్రమపై ఆధారపడిన బతుకుతున్న వేలాది కుటుంబాలు ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయి. ఎలాగైనా నాపరాతి పరిశ్రమను గట్టెక్కించాలని పలువురు నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో సమావేశ భవనంలో శనివారం నాపరాయి గనుల యజమానుల తో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజ్యాంగ నాథ్ రెడ్డి, విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లు వీరితో పాటు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి.., జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ లతో కలిసి గనుల యజమానులతో సమావేశం అయ్యారు.
సంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటాంమని మంత్రులు హామీ ఇచ్చారు. ఒక హెక్టార్ నాపరాతి గని రెన్యువల్ ఫీజును భారీగా తగ్గించారు. 10 నుండి ఐదు రేట్లు తగ్గిస్తున్నాంమని మంత్రి ప్రకటించారు. దీనివల్ల నాపరాతి గనుల యజమానులకు పెద్ద ఊరడం లభించినట్లయింది. నాపరాజు పరిశ్రమలకు రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తాంమని భూగర్భ , గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
నాపరాతి పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటాంమని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చింతపండు, నాపరాయి పరిశ్రమలపై 15 శాతం వున్నా జీఎస్టీ 5 శాతానికి తగ్గించడంలో ఆర్థిక మంత్రి బుగ్గన కృషి చాలా ఉందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నాపరాయి మీద ఆధారపడి బతికే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. సీఎఫ్ఓ విషయంలో మూడేళ్ల గడువును ఐదేండ్లకు పొడిగిస్తూ నిర్ణయంతీసుకున్నామని వెల్లడించారు. క్వారీ డెడ్ రెంటు కాల వ్యవధిపై అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటాంమని మంత్రి పెద్దిరెడ్డి హామీనిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..