AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముళ్లపొదల్లో నుంచి పసిపాప ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూడగా ఊహించని సీన్..!

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు-తాళ్లూరు రోడ్డు పక్కన మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కేవలం ఏడు రోజుల వయసున్న పసిపాపను ఒక సంచిలో చుట్టి ముళ్ళ పొదలలో వదిలి వెళ్ళిపోయారు. ఆ దారి గుండా వెళ్తున్న కొందరు స్థానికులకు పసిపాప ఏడుపు వినపడటంతో అనుమానం వచ్చి పొదల్లో పరిశీలించారు. సంచిలో ఏడుస్తున్న పసికందును చూసి వారు వెంటనే ముండ్లమూరు పోలీసులకు సమాచారం అందించారు.

ముళ్లపొదల్లో నుంచి పసిపాప ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూడగా ఊహించని సీన్..!
Baby Girl In Thorny Thicket
Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 3:20 PM

Share

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు-తాళ్లూరు రోడ్డు పక్కన మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కేవలం ఏడు రోజుల వయసున్న పసిపాపను ఒక సంచిలో చుట్టి ముళ్ళ పొదలలో వదిలి వెళ్ళిపోయారు. ఆ దారి గుండా వెళ్తున్న కొందరు స్థానికులకు పసిపాప ఏడుపు వినపడటంతో అనుమానం వచ్చి పొదల్లో పరిశీలించారు. సంచిలో ఏడుస్తున్న పసికందును చూసి వారు వెంటనే ముండ్లమూరు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, 108 అంబులెన్స్ సహాయంతో పాపను తక్షణమే అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు, డాక్టర్లు పాపకు అత్యవసర వైద్య సహాయం అందించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం పాపను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు… అక్కడ డాక్టర్‌ కిరణ్‌ పాపకు వైద్యం అందించారు.

శనివారం (జూలై 11) సోమవారం రోజు ఉదయం సుమారు 9:15 గంటల ప్రాంతంలో ముండ్లమూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి ఒక అనాథ పసిపాపను మా అద్దంకి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ పాప ఆడపిల్ల… బరువు 1.75 కేజీలు ఉంది. ఎవరో నార్మల్ డెలివరీ అయిన తర్వాత పాప భారం అనుకున్నారో ఏమో కానీ, పొలాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ముండ్లమూరు పీహెచ్‌సీ సిబ్బంది పాపను ఇక్కడికి పంపించారని డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు.

నిలకడగా చిన్నారి ఆరోగ్యం

పాపను ఆసుపత్రిలో చేర్చుకునే సమయానికి ఆమె తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఉంది. అయితే పాప హార్ట్ రేట్, ఆక్సిజన్ శాచురేషన్ బాగానే ఉన్నాయి. పాప ఆకలితో, పాల కోసం తీవ్రంగా ఏడుస్తోందని డాక్టర్‌ కిరణ్‌ వెల్లడించారు. బరువు 1.8 కేజీల కంటే తక్కువ ఉండటాన్ని లో- బర్త్ వెయిట్ బేబీ అంటారు. వెంటనే క్యాన్యులా పెట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో పాటు ఫార్ములా మిల్క్ అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉంది. నిబంధనల ప్రకారం ఐసీడీఎస్ , చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ శాఖలకు సమాచారం అందించారు. పాపను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలోని ఎన్‌బీఎస్‌యూ కి తరలిస్తున్నారు.

టీవీ9 విలేకరి మానవత్వం

ఆసుపత్రిలో పసిపాప పాల కోసం ఏడుస్తున్న సమయంలో, అక్కడకు వార్త కవరేజ్ కోసం వెళ్లిన టీవీ9 ప్రతినిధి స్పందించారు. పాపకు తక్షణమే పాలు ఇతర అత్యవసర వస్తువుల కొనుగోలు సహాయం కోసం తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. టీవీ9 ప్రతినిధి చేసిన ఈ సాయాన్ని ఆసుపత్రి సిబ్బంది స్థానికులు అభినందించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పాపను వదిలివెళ్లిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us