Sajjala: టీడీపీ ఆఫీస్‌ దాడి కేసు ఎంక్వైరీ స్పీడప్.. సజ్జలను ప్రశ్నించిన పోలీసులు..!

|

Oct 17, 2024 | 8:00 PM

టీడీపీ ఆఫీస్‌ దాడి కేసులో ఎంక్వైరీ స్పీడప్‌ అయింది. ఈ కేసులో సజ్జల పాత్రను గుర్తించిన పోలీసులు... విచారణకు పిలిపించారు. మరి కేసులో సజ్జల పాత్రపై పోలీసులు దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి..? విచారణలో సజ్జలను పోలీసులు ఏమడిగారు..? దానికి ఆయన ఏం చెప్పారు.

Sajjala: టీడీపీ ఆఫీస్‌ దాడి కేసు ఎంక్వైరీ స్పీడప్.. సజ్జలను ప్రశ్నించిన పోలీసులు..!
Sajjala Ramakrishna Reddy
Follow us on

టీడీపీ ఆఫీస్‌ దాడి కేసులో ఎంక్వైరీ స్పీడప్‌ అయింది. ఈ కేసులో సజ్జల పాత్రను గుర్తించిన పోలీసులు… విచారణకు పిలిపించారు. మరి కేసులో సజ్జల పాత్రపై పోలీసులు దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి..? విచారణలో సజ్జలను పోలీసులు ఏమడిగారు..? దానికి ఆయన ఏం చెప్పారు.

గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి రూరల్ పోలీసులు విచారించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఏ120గా సజ్జలగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల పాత్రను పోలీసులు గుర్తించి.. విచారణకు పిలిపించారు. దాదాపు గంటన్నరపాటు ఈ విచారణ జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పీఎస్‌ లోపలికి వెళ్లిన సజ్జల… 4.30కి బయటకు వచ్చారు. విచారణలో భాగంగా సజ్జలపై ఈ కేసుకు సంబంధించి 38 ప్రశ్నలు సంధించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తూ సజ్జలను పోలీసులు విచారించారు.

విచారణ తర్వాత బయటకు వచ్చిన సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారన్నారు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని సజ్జల మండిపడ్డారు. ప్రజాసమస్యలను టీడీపీ గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ కేసును పొడిగించాలనే సీఐడీకి అప్పగించారని సజ్జల అన్నారు.

సజ్జల ఏమన్నారంటే..?

సజ్జల వర్షన్‌ ఇలా ఉంటే… సజ్జలను విచారించిన మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మరో లైన్‌ వినిపించారు. విచారణకు సజ్జల సహకరించలేదన్నారు. తాము అడిగిన చాలా ప్రశ్నలకు గుర్తు లేదంటూ సమాధానమిచ్చారని సీఐ వివరించారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుంటామంటే అందుకు సజ్జల నిరాకరించాన్నారు. ఈ కేసులో సజ్జల పాత్ర ఉన్నట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని సీఐ శ్రీనివాసరావు
తెలిపారు.

పొన్నవోలుతో పోలీసుల వాగ్వివాదం..

ఇక విచారణకు హాజరైన సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి, అప్పిరెడ్డిలు ఉన్నారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు సజ్జల ఒక్కరే విచారణకు లోనికి వెళ్లారు. సజ్జల విచారణకు వచ్చిన సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్‌, నందిగంసురేష్‌ను పోలీసులు విచారించారు.